Priyansh Arya : ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్న ప్రియాంష్ ఆర్య.
Priyansh Arya : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో 23 ఏళ్ల యంగ్ ప్లేయర్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 క్రికెట్ లో అద్భుత రికార్డును అందుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఆగస్టు 31 శనివారం చారిత్రాత్మక ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచింది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ల సరసన చేరాడు. అతని తుఫానీ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో అత్యధిక స్కోర్ మార్కును కూడా ఢిల్లీ టీమ్ అందుకుంది.
ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఒకే ఒవర్ లో ఆరు సిక్సర్లు చూడటం చాలా అరుదు. మరోసారి ఈ అద్భుత దృశ్యం టీ20 క్రికెట్ ఫార్మాట్ లో ఆవిష్కృతమైంది. ఢిల్లీ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య అసాధారణ బ్యాటింగ్ శక్తిని చూపిస్తూ బౌలర్లపై ఆధిపత్యం చేయగల అతని సామర్థ్యాన్ని చూపించాడు. ఒకే ఓవర్ లో.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది రికార్డుల మోత మోగించాడు. మ్యాచ్ 12వ ఓవర్లో ప్రియాంష్ తన ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టిస్తూ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. భరద్వాజ్ బౌలింగ్ ను చిత్తుచిత్తూగా ఆడుకున్నాడు. తొలి బంతిని లాంగ్ ఆఫ్ లో సిక్స్ గా మలిచి ఓవర్ ప్రారంభించాడు. రెండో సిక్సర్ డీప్ మిడ్ వికెట్ పై ట్రేడ్ మార్క్ లెఫ్ట్ హ్యాండ్ షాట్ ఆడాడు. మూడవ సిక్స్ కూడా అదే మాదిరిగా లాంగ్ ఆన్ ను దాటింది.
undefined
ఆ తర్వాత మూడు బంతులు కూడా సిక్సర్లుగా మలిచి ఒకే ఒవర్ లో ఆరు సిక్సర్లు బాదిన మరో భారత ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. డీపీఎల్ 2024 టీ20 టోర్నీలో భాగంగా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇది జరిగింది. అతనికి తోడుగా ఆయుష్ బదోని కూడా దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల బదోని సునామీ ఇన్నింగ్స్ తో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. దీంతో టీ20 క్రికెట్ లో ఒక మ్యాచ్‌లో అత్యధిక స్కోరును నమోదుచేసింది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఆరు బంతుల్లో ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేయడంతో లెజెండరీ ప్లేయర్ల లిస్టులో చేరాడు. దేశీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లలో ఆరు సిక్సర్లు కొట్టిన రాస్ వైట్లీ (2017), హజ్రతుల్లా జజాయ్ (2018), లియో కార్టర్ (2020)ల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, దీపేంద్ర సింగ్ ఐరీ (రెండుసార్లు) అంతర్జాతీయ క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ప్లేయర్లుగా రికార్డు సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ తో తో జరిగిన మ్యాచ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యూవీ వరుసగా ఆరు సిక్సర్లు బాదడం విశేషం.
6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩
There’s nothing Priyansh Arya can’t do 🔥 | pic.twitter.com/lr7YloC58D