41 ఏళ్ల వయసులో 5 వికెట్లు... శాంత మూర్తి అరుదైన రికార్డు...

Published : Jan 18, 2021, 11:27 AM IST
41 ఏళ్ల వయసులో 5 వికెట్లు... శాంత మూర్తి అరుదైన రికార్డు...

సారాంశం

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో అదరగొట్టిన శాంత మూర్తి... ఆరు వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన పుదుచ్చేరి... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో అరుదైన రికార్డు...

40+ వయసులో బ్యాటింగ్ కొనసాగించడమే సులువే కానీ, బౌలింగ్ చేయడం అంత తేలిక కాదు. స్పిన్ అయితే పర్లేదు కానీ పేస్ బౌలింగ్ అంటే చాలా కష్టం. అయితే 41 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో పుదుచ్చేరికి ఆడుతున్న కుడిచేతి వాటం పేసర్ శాంత మూర్తి... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమై చేశాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

అతి పెద్ద వయసులో 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శాంత మూర్తి. ఈ ఫీట్ సాధించే సమయానికి శాంత మూర్తి వయసు 41 ఏళ్ల 129 రోజులు. ఇంతకుముందు ఈ రికార్డు కినుట్ తుల్లచ్ పేరిట ఉంది.

2006లో సెయింట్ లూసియాపై 41 ఏళ్ల ఏడు రోజుల వయసులో 5 వికెట్లు పడగొట్టాడు తుల్లచ్. ఐదు వికెట్లు తీసిన శాంత మూర్తి... యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేశ్ లాడ్, సుజిత్ నాయక్‌లను అవుట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన