IPL 2022: అప్పటిదాకా 25 శాతం మంది.. ఆ తర్వాత పెంపు.. ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ

Published : Mar 03, 2022, 01:37 PM IST
IPL 2022: అప్పటిదాకా 25 శాతం మంది.. ఆ తర్వాత పెంపు.. ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ

సారాంశం

IPL 2022 Schedule: గత రెండు సీజన్లుగా ఐపీఎల్ ను ప్రత్యక్షంగా వీక్షించుదామనుకుని నిరాశకు గురైన క్రికెట్ ఫ్యాన్స్ కు  బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.   త్వరలో ప్రారంభం కాబోయే సీజన్ లో... 

కరోనా పుణ్యమా అని గత కొన్నాళ్లుగా క్రికెట్ అభిమానులు స్టేడియాలకు వెళ్లి మ్యాచులు చూసే అదృష్టాన్ని కోల్పోతున్నారు. గత రెండున్నరేండ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా తో ఎక్కువ శాతం క్రికెట్ మ్యాచులు  బయో బబుల్ ఆంక్షల నడుమ.. ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. ఇక ఆటతో పాటు వినోదాన్ని కూడా పండే ఐపీఎల్ వంటి లీగ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ కరోనా వల్ల గత రెండేండ్లుగా  వారికి ఆ అవకాశమే లేకుండా పోయింది.  అయితే ఈసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 

2022 ఐపీఎల్ సీజన్ ను 25 శాతం మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించడానికి సిద్ధమైంది. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడం.. ఇప్పట్లో కొత్త వేవ్ లు వచ్చే అవకాశం తక్కువేనని  వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ లో తొలి అంచె  ముగిసేనాటికి.. అంటే ఏప్రిల్ 15 వరకు 25 శాతం  మంది ప్రేక్షకులతో మ్యాచులను నిర్వహించనుంది. 

ఏప్రిల్ 15 తర్వాత  ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశమున్నది.  అప్పటికి కరోనా పరిస్థితులను  చూసి..  తర్వాత నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ.. 

ప్రాక్టీస్ కు ఐదు వేదికలు.. 

ఐపీఎల్ జట్లు ఈ సీజన్ లో ముంబై, పూణె లో మ్యాచులు ఆడనున్నాయి. వాంఖడే, డీవై పాటిల్, బ్రబోర్న్, పూణెలోని ఎంసీఏ  గ్రౌండ్ లో  మ్యాచులు ఆడాల్సి ఉంది.   అయితే  మ్యాచులకు ముందు ప్రాక్టీస్ సెషన్ కోసం ఆయా జట్లు.. ఐదు వేదికల్లో ట్రైనింగ్ చేసుకోవచ్చు. అవేంటంటే.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఎంసీఏ గ్రౌండ్, థానే లోని ఎంసీఏ గ్రౌండ్, డీవై పాటిల్ యూనివర్సిటీలోని గ్రౌండ్,  ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)తో పాటు నవీ ముంబై లో ఉన్న  రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.  అయితే ఏ ఏ జట్టుకు ఏది సొంత గ్రౌండ్..? అనేది ఇంకా నిర్ణయించాల్సి  ఉంది. 

 

ఇదిలాఉండగా.. ఐపీఎల్ ను సజావుగా నిర్వహించేందుకు గాను నిన్న (బుధవారం) మహారాష్ట్ర  ప్రభుత్వంతో చర్చలు జరిపిన బీసీసీఐ.. పది ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.  మార్చి 8 కల్లా జట్లన్నీ ముంబైకి చేరాలని,  14 తేది నుంచి ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించాలని సూచించింది. అంతేగాక కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. భారత ఆటగాళ్లు 3 రోజులు, విదేశీ ఆటగాళ్లు 8 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది.  పది ఫ్రాంచైజీల మధ్య జరుగనున్న ఈ మెగా సమరం మార్చి 26న మొదలై మే 29న ముగుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : వన్డేల్లో కొట్టారు.. టీ20ల్లో తగ్గేదేలే ! న్యూజిలాండ్ పై ప్రతీకారానికి భారత్ రెడీ !
BCCI గ్రేడ్స్ అంటే ఏమిటి? భారత క్రికెటర్లు ఎంత సంపాదిస్తారు?