అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు

Siva Kodati |  
Published : Sep 10, 2019, 10:33 AM IST
అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు

సారాంశం

అసల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు

అసల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు.

ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు లంక జట్టు.. పాక్‌లో పర్యటించాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి వుంది. పాక్ పర్యటన దృష్ట్యా శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం క్రికెటర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా టీ20, వన్డే జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న మలింగా, కరుణరత్నే సహా పదిమంది ఆటగాళ్లు పాక్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

2009లో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీలంక క్రికెటర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఏ దేశపు క్రికెట్ జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది