షోయబ్! పేర్లు చెప్పు: కనేరియా ఇష్యూపై పాక్ మాజీ క్రికెటర్ సవాల్

Published : Jan 07, 2020, 08:41 AM IST
షోయబ్! పేర్లు చెప్పు: కనేరియా ఇష్యూపై పాక్ మాజీ క్రికెటర్ సవాల్

సారాంశం

కనేరియా పట్ల వివక్ష ప్రదర్శించిన క్రికెటర్ల పేర్లు వెల్లడించాలని పాకిస్తాన్ క్రికెట్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ డిమాండ్ చేశారు. తన పట్ల వివక్ష ప్రదర్శించారని కనేరియా అనడం ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నాడు.

కరాచీ: మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా పట్ల వివక్ష ప్రదర్శించిన క్రికెటర్ల పేర్లు వెల్లడించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ షోయబ్ అక్తర్ ను కోరారు హిందువు కావడం వల్ల కనేరియాతో భోజనం చేసే సమయంలో కొందరు క్రికెటర్లు వివక్ష ప్రదర్శించారని షోయబ్ అక్తర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

అక్తర్ వ్యాఖ్యలపై కనేరియా కూడా స్పందించాడు. అక్తర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్ వంటి కొద్ది మంది ఆటగాళ్లే తనకు మద్దతు ఇచ్చారని కనేరియా అన్నాడు.

Also Read: నేను చచ్చిపోవాలా: తీవ్ర భావోద్వేగానికి గురైన కనేరియా

తన పట్ల వివక్ష ప్రదర్శించిన ఆటగాళ్ల పేర్లు తర్వాత వెల్లడిస్తానని కనేరియా అనడం ఆశ్చర్యం కలిగించిందని బాసిత్ అలీ అన్నాడు. షోయబ్ కు ప్రచారం అక్కర్లేదని, షోయబ్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరైట్ అని, షోయబ్ ప్రత్యేకంగా కీర్తి అవసరం లేదని, కానీ షోయబ్ ఆటగాళ్ల పేర్లు వెల్లడించాలని ఆయన అన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన ఆ మాటలన్నాడు.

తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో కనేరియా పట్ల వివక్ష ప్రదర్శించిన సందర్భాలేవీ లేవని ఆయన అన్నారు. 

Also Read: ఇక వదిలేయండి ప్లీజ్.... షోయబ్ అక్తర్

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !