సిరీస్ కోల్పోయిన టీమిండియా, రోహిత్ లేకపోవడం వల్లే అంటున్న విరాట్ కోహ్లీ

By telugu news teamFirst Published Mar 2, 2020, 11:16 AM IST
Highlights

తాము ఆశించినంతగా ఆటతీరును కనబరచలేకపోయినట్లు ఒప్పుకుంటున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు. తప్పులను తెలుసుకొని ముందుకు వెళతామని చెప్పాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాట్స్ మెన్స్ వెఫల్యం రెండో టెస్టులో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. 

టీమిండియా మరోసారి ఓటమిపాలయ్యింది. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఓటమిపాలయ్యింది. దీంతో.. సిరీస్ ని చేజార్చుకుంది. అయితే... తమ జట్టు ఓటమిగల కారణాలను కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా ముందు వివరించారు. సిరీస్ ఓడిపోవడానికి రోహిత్ లేకపోవడం కూడా ఒక కారణమని కోహ్లీ పేర్కొన్నాడు.

మ్యాచ్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ...  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ బాగానే చేశామని అభిప్రాయపడ్డాడు. అయితే బౌలర్ల కష్టానికి తగ్గట్టుగా బ్యాట్స్ మెన్స్ రాణించకపోవడం దురదృష్టకరమని చెప్పాడు. రోహిత్ అందుాటులో లేడని.. తాను కూడా పరుగులు సాధించలేకపోయానని కోహ్లీ అంగీకరించాడు.

Also Read విలియమన్స్ ను హేళన చేసిన కోహ్లీ: జర్నలిస్టుపై విరుచుకుపడ్డ కెప్టెన్..

తాము ఆశించినంతగా ఆటతీరును కనబరచలేకపోయినట్లు ఒప్పుకుంటున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు. తప్పులను తెలుసుకొని ముందుకు వెళతామని చెప్పాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాట్స్ మెన్స్ వెఫల్యం రెండో టెస్టులో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. టెస్టు సిరీస్ లో తొలిసారి భారత బౌలర్లు చెలరేగుతూ రెండు సెషన్లలోనే కివీస్ పది వికెట్లను నేలకూల్చారు.

ప్రత్యర్థి టెయిలెండర్స్ కాస్త పోరాడినా కోహ్లీ సేనకు  పెద్దగా ఆధిక్యం ఏమీ లభించలేదు. ఇక ఈసారైనా బ్యాట్స్ మెన్ స్థాయికి తగ్గట్టు ఆడి న్యూజిలాండ్ ను ఒత్తిడిలో పడేస్తారేమోనని అంతా ఆశించారు. అయితే.. ఆశించినట్లు క్రికెటర్లు తమ ఆటను మెరుగుపరుచుకోలేకపోయారు. వరసగా ఔట్ అవుతూ పెవీలియన్ బాట పట్టారు. 

click me!