ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మహారాష్గ్రలో స్కూళ్ల మూసివేత ?

By team telugu  |  First Published Dec 23, 2021, 12:03 PM IST

మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ కేసులు  ​పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రలోనే అధికంగా ఉన్నాయి. దీంతో కరోనా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.


ఒమిక్రాన్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. రోజు రోజుకు త‌న ప‌రిధి విస్త‌రించుకుంటూ పోతోంది. ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాల‌కు వ్యాపిస్తోంది. యూకేలో అయితే ప‌రిస్థితి దారుణంగా ఉంది. అక్క‌డ ప్ర‌తీ రోజు 10 వేల‌కు పైగా కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్ మృతులు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఒమిక్రాన్ కాకుండా కోవిడ్ -19 డెల్టా వేరియంట్ రకానికి చెందిన కరోనా కేసులు కూడా అధికంగానే న‌మోద‌వుతున్నాయి. మ‌న దేశంలో కూడా దీని ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో 213 కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం, అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయ్యాయి. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు ప్రారంభించాయి. 

మ‌హారాష్ట్ర‌లోనే అధికం..
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇందులో డెల్టా వేరియంట్ కు చెందిన కేసులే అధికంగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అయితే ఒమిక్రాన్ కేసుల వేగంగా కూడా అదే విధంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నెల మొద‌టిలో దేశంలో తొలి రెండు ఒమిక్రాన్ కేసుల‌ను గుర్తించారు. గ‌డిచిన 22 రోజుల్లో ఏకంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య డ‌బుల్ సెంచ‌రీ దాటింది. దేశంలో క‌రోనా మొద‌టి సారి వెలుగులోకి వ‌చ్చిన స‌మ‌యంలో కూడా మొద‌ట‌గా ఇలాంటి వేగ‌మే క‌నిపించింది. త‌రువాత వేగంగా ఒకే సారి రెండు, మూడింత‌లు పెరుగుతూ పోయింది. చివ‌రికి దానిని అదుపు చేయ‌డానికి లాక్ డౌన్ విధించాల్సి వ‌చ్చింది. ఈ ఒమిక్రాన్ పెరుగుతుండ‌టం వ‌ల్ల మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితిలే వ‌స్తాయోమో అని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

Latest Videos

undefined

తెలంగాణ: 24 గంటల్లో 182 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు
మ‌న దేశంలో మొద‌టి కేసుల‌ను క‌ర్నాట‌క‌లో గుర్తించారు. త‌రువాత ఒక్కొక్క‌టిగా అన్ని రాష్ట్రాల్లోనూ గుర్తిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌ల్లో కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్ల‌ను మూసి వేయాల‌నే ఆలోచ‌న‌లో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీనికి ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ వ్యాఖ్య‌లు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. త‌మ‌కు పిల్ల‌ల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాద‌ని, అవ‌స‌ర‌మైతే స్కూళ్ల‌ను మూసివేస్తామ‌ని ఇటీవ‌ల ఆయ‌న తెలిపారు. మ‌హారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా 236 కేసులు న‌మోద‌య్యాయి. ఇన్ని ఒమిక్రాన్ కేసుల‌తో దేశంలోనే మొద‌టి స్థానంలో మ‌హారాష్ట్ర నిలిచింది. దీంతో అక్క‌డ ఆంక్ష‌లు మొద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. నిజానికి మ‌హారాష్ట్రలో విద్యా సంస్థ‌ల‌ను గ‌త అక్టోబ‌ర్‌లోనే ప్రారంభించారు. ప్రైమెరీ స్కూల్స్ డిసెంబ‌ర్ మొద‌టి నుంచి ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డుతున్న విద్యార్థుల చ‌దువులు మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లిపోయే అవకాశం క‌నిపిస్తోంది. ఇక్క‌డ ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు కూడా అధికంగా క‌నిపిస్తోంది. ఏకంగా మ‌హారాష్ట్రలో 18 శాతం కంటే ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దీంతో అంద‌రూ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

ఢిల్లీ, క‌ర్నాట‌క‌లో న్యూయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు..
ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఆంక్ష‌లు విధించాయి. ఈ మేర‌కు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశాయి. క‌ర్నాట‌క‌లో కేవ‌లం న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు చేశారు. ఢిల్లీలో మాత్రం క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ వేడుక‌ల‌తో పాటు పెద్ద పెద్ద స‌మావేశాలు, స‌భ‌లు వంటి అన్ని సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 
 

click me!