అరెస్టు చేస్తే ముందు నేనే ఉంటా : ఎలన్ మస్క్

By Sandra Ashok Kumar  |  First Published May 12, 2020, 11:00 AM IST

చాలా రోజుల తరువాత ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ దావా వేసిన తరువాత ఎలన్ మస్క్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు.


శాన్ఫ్రాన్సిస్కో (ఎఎఫ్‌పి) : ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సోమవారం అమెరికా దేశం కాలిఫోర్నియాలోని  ఆటోమొబైల్ అసెంబ్లీ ప్లాంట్‌లో ఉత్పత్తిని తిరిగి  ప్రారంభిస్తున్నానని తెలిపారు.  ఫ్యాక్ట‌రీల‌ను ఇప్పుడు ఓపెన్ చేయ‌వ‌ద్దు అంటూ కాలిఫోర్నియాలోని అల‌మేడా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఆ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ టెస్లా కంపెనీలో ఉత్ప‌త్తి ప్రారంభిస్తున్న‌ట్లు ఎల‌న్ మ‌స్ తాజాగా ట్వీట్ చేశారు. చాలా రోజుల తరువాత ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ దావా వేసిన తరువాత ఎలన్ మస్క్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు.

Latest Videos

"అల‌మేడా కౌంటీ నగర నిబంధనలకు విరుద్ధంగా టెస్లా ఈ రోజు ఉత్పత్తిని పున  ప్రారంభిస్తోంది" అని మస్క్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు."ఒక‌వేళ అధికారులు ఎవ‌రినైనా అరెస్టు చేస్తే, ముందు వ‌రుస‌లో తానే ఉంటాన‌ని" ఎల‌న్ మ‌స్క్ తెలిపారు. 

also read కరోనా ఎఫెక్ట్: డిజిటల్‌లోనే ఆడి కార్స్ ’బుకింగ్స్’ అండ్ సేల్స్

ప్లాంట్ లో పనులు తిరిగి ప్రారంభించటానికి రాష్ట్ర అధికారులు ఆమోదం తెలిపారు,ఫ్యాక్ట‌రీల‌ను ఇప్పుడు ఓపెన్ చేయ‌వ‌ద్దు అంటూ కాలిఫోర్నియాలోని అల‌మేడా జిల్లా అధికారులు అడ్డుకున్నారని మస్క్ చెప్పారు.

"కాలిఫోర్నియా రాష్ట్రం  ఆమోదించింది, కాని అల‌మేడా కౌంటీ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవరిస్తున్నారు " అని చెప్పాడు. "అలాగే, యుఎస్ లోని అన్ని ఇతర ఆటో కంపెనీలు తిరిగి ప్రారంభించడానికి అనుమతి పొందాయి. టెస్లాపై  మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారు అని ఆన్నారు. 


లాక్‌డౌన్ ఇలాగే ఉంటే త‌న హెడ్ ఆఫీసును మ‌రో చోటుకి త‌ర‌లిస్తాన‌ని గ‌త వారం కూడా ఓ వార్నింగ్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ ప్రకటన తరువాత, అల‌మేడా  కౌంటీ అత్యవసర సేవల కార్యాలయం, అధికారులు ఒక ప్రణాళికను ఆమోదించే వరకు టెస్లాకు కనీస ప్రాథమిక కార్యకలాపాలను నిర్వహించడానికి మాత్రమే అనుమతించబడిందని చెప్పారు.
 

click me!