సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా కంపెనీ భారీ విరాళం

By Sandra Ashok Kumar  |  First Published May 11, 2020, 3:24 PM IST

ఓలా ఇప్పటికే కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాడటానికి వివిధ రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్లతో పాటు పిఎమ్ కేర్స్ ఫండ్ కు 8 కోట్లు అందించనుంది.
 


కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళనాడు రాష్ట్రానికి సహాయం చేయడానికి ఓలా గ్రూప్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. గత నెలలో, భారతదేశపు అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే పిఎమ్ కేర్స్ ఫండ్‌కు 5 కోట్ల రూపాయలను అందించడంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు మరో 3 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రతిజ్ఞ చేసింది.

కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి క్యాబ్ అగ్రిగేటర్ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు అందించింది. 100 కి పైగా ఆరెంజ్, గ్రీన్ జోన్ నగరాల్లో సాధారణ ఓలా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Latest Videos

also read హీరో రిటైల్ బిజినెస్ తిరిగి ప్రారంభం.. 10 వేల వెహికల్స్ విక్రయం..

ఆరోగ్య సంరక్షణ, రాష్ట్రంలో ఆర్థిక సహాయ చర్యలు, సహాయ చర్యలకు ఈ ఫండ్ సహకరిస్తుందని ఓలా సంస్థ తెలిపింది. కరోనా వైరస్ పై పోరాడటానికి మేము తమిళనాడు రాష్ట్రానికి మాతరపు సహకారాన్ని అందిస్తున్నాము.

ఈ అసాధారణ సమయాల్లో కరోనా వైరస్  ఎదురుకునేందుకు ముందు ఉండి పనిచేస్తున్న స్త్రీ, పురుషులకు మా కృతజ్ఞతలు.

ఓలా ఉద్యోగులు ఇప్పటికే 20 కోట్లు విరాళంగా అందించగా, ఓలా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ భావిష్ అగర్వాల్ స్వయంగా తన 1 సంవత్సర జీతం నిధికి ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేసాడు. అనేక రెడ్ జోన్ ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందిస్తూనే, కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 కి పైగా ఆరెంజ్, గ్రీన్ జోన్ నగరాల్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
 

click me!