శుక్రవారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసును ఉచితంగా అందించనున్నారు. అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ స్పెషల్ డ్రైవ్ 75 రోజుల పాటు ఉంటుంది.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ నేటి (శుక్రవారం) నుంచి ఫ్రీ ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు)లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత బుధవారమే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ 75 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 14 సార్లు బలవంతపు అబార్షన్.. మహిళ ఆత్మహత్య..
undefined
‘‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ జూలై 15, 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచిత COVID-19 ప్రికాషన్ డోసు అందించబడుతుంది. ఈ నిర్ణయం విషయంలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం పోరాటాన్ని మరింత బలపరుస్తుంది. అదనపు భద్రతను ఏర్పరుస్తుంది. అర్హులైన వారందరినీ వీలైనంత త్వరగా ఈ ప్రికాషనరీ డోసును పొందాలని నేను కోరుతున్నాను ’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 7 గంటల వరకు భారత్ లో COVID-19 టీకా కవరేజీ 199.12 కోట్లకు మించిపోయింది. దీనిని 2,61,58,303 సెషన్ల ద్వారా అందించారు. అయితే కోవిడ్ -19కి వ్యతిరేకంగా 12-14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ ఏడాది మార్చి 16న ప్రారంభించారు. ఇప్పటి వరకు 3.76 కోట్ల కంటే ఎక్కువ మంది యుక్త వయస్సు ఉన్న పిల్లలకు COVID-19 వ్యాక్సిన్ ఫస్ట్ డోసు అందించారు. అయితే 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రికాషన్ డోసు ఇవ్వడం ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రారంభమైంది. అయితే దీనికి అంత పెద్ద స్థాయిలో స్పందన రాలేదు.
కొవిడ్ దెబ్బతో జాతీయ పార్టీలకు తగ్గిన విరాళాలు.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎంత అంటే?
‘‘భారత జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితం రెండో మోతాదును పొందారు. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనాలు రెండు డోస్‌లతో ప్రాథమిక టీకా వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీ స్థాయిలు తగ్గుతాయని సూచించాయి. బూస్టర్ ఇవ్వడం రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది’’ అని ఓ అధికారి తెలిపారు అయితే 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 16 కోట్ల మంది అర్హులైన జనాభాలో 26 శాతం మంది ప్రికాషన్ డోసు అందుకున్నారని ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఇందులో ఎక్కువగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ కార్మికులు బూస్టర్ డోస్ ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం లబ్ధిదారులందరికీ COVID-19 వ్యాక్సిన్ రెండో, ప్రికాషనరీ డోసుల మోతాదుల మధ్య గ్యాప్ ను తొమ్మిది నుండి ఆరు నెలలకు తగ్గించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) నుండి సిఫార్సును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.