షాకింగ్‌.. లెజెండరీ సింగర్‌ను బలి తీసుకున్న కరోనా

By Satish ReddyFirst Published Mar 30, 2020, 11:18 AM IST
Highlights

అమెరికాలోని ఒక్లాహామాలో నివాసం ఉంటున్న స్టార్ మ్యూజీషియన్‌ జోయ్‌ డిఫ్ఫీ కరోనా కారణంగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయసు 61 సంవత్సరాలు కావటంతో కరోనా ప్రభావంతో ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

1990లలో ఎన్నో సూపర్‌ హిట్ ఆల్బమ్స్ అందించటంతో పాటు గ్రామీ అవార్డును సైతం అందుకున్న స్టార్ సింగర్‌ జోయ్‌ డిఫ్ఫీ కరోనాతో మృతి చెందాడు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఫేస్‌ బుక్‌ ద్వారా కన్‌ఫార్మ్‌ చేశారు. కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన కాంప్లికేషన్స్‌తోనే ఆదివారం జోయ్‌ మరణించినట్టుగా వారు వెల్లడించారు.

మరణించడానికి రెండు రోజుల ముందే జోయ్ తనకు కరోనా వైరస్ సోకినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా అని తెలిపిన ఆయన త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు. `ప్రస్తుతం నేను నా ఫ్యామిలీ ప్రైవసీ కోరుకుంటున్నాం. నా అభిమానులు ప్రజలు అంతా ఈ కష్ట కాలంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా` అన్ని తెలిపారు.

ఒక్లాహామాలో నివాసముండే డిఫ్ఫీ 1990లో సంచలనాలు సృష్టించాడు. పిక్‌ అప్‌ మేన్‌, ప్రాప్‌ మీ అప్‌ బిసైడ్ ద జ్యూక్ బాక్స్, జాన్‌ డేర్‌ గ్రీన్‌ లాంటి సూపర్‌ హిట్స్ ఆల్బమ్స్‌ ఆయనకు భారీ ఫాలోయింగ్ వచ్చింది. అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు లక్షా 40 వేల మంది వైరస్ సోకినట్టుగా అంచన వేస్తుండగా 3 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

click me!