అదే పనిగా మాస్క్‌లు పెట్టుకుంటున్నారా: చారలు పడకుండా ఉండాలంటే

By Siva Kodati  |  First Published Apr 8, 2020, 5:25 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న అంశాల్లో ఒకటి సామాజిక దూరం, రెండోది మాస్కులు ధరించడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్క్‌లు ధరించడం వల్ల చాలా మందికి ముఖ్కు, ముఖంపై చారలు వస్తున్నాయి.


ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న అంశాల్లో ఒకటి సామాజిక దూరం, రెండోది మాస్కులు ధరించడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్క్‌లు ధరించడం వల్ల చాలా మందికి ముఖ్కు, ముఖంపై చారలు వస్తున్నాయి.

Also Read:నిన్న బెదిరించాడు.. నేడు స్వరం మార్చి.. ట్రంప్ కొత్త ధోరణి

Latest Videos

అందరికంటే ఎక్కవగా డాక్టర్లు, పోలీసులు వంటి అత్యవసర సేవలు అందించే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి డెర్మటాలజిస్టులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మెడికల్ డివైజ్‌లు, మాస్క్‌లు లాంటి ఆరోగ్య పరికరాలు, వస్తువుల వల్ల వచ్చే చర్మ సమస్యలపై యూనివర్సిటీలో ఓ బృందం పరిశోధనలు చేసి కొన్ని సూచనలు చేసింది. 

ముఖంపై చారలు పడకుండా పాటించాల్సిన నియమాలు:

undefined

మాస్కులు ధరించిన సమయంలో ముఖం పై పట్టే చెమట వల్ల చర్మం రాసుకోవడంతో రఫ్ అయిపోతుంది. దీని వల్ల ముక్కు, బుగ్గల మీద చారలు రావడం, ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందట.

అందువల్ల మాస్క్‌లు ధరించడానికి ముందే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ వేసుకోవడానికి కనీసం అరగంట ముందు బేరియర్ క్రీమ్‌ను అప్లై చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:ఊపిరిపీల్చుకుంటున్న చైనా.. వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేత

అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి మాస్కును తీసి ముఖానికి గాలి తగిలేలా చూసుకోవాలని తెలిపారు. దీని వల్ల ముఖం మీద మాస్క్ స్ట్రిప్స్ ఒత్తిడి కాస్తయినా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. 

click me!