న్యూయార్క్‌లో పులికి కూడ కరోనా: చికిత్స చేస్తున్న వైద్యులు

By narsimha lode  |  First Published Apr 6, 2020, 10:49 AM IST

 అమెరికాలో మనుషులనే కాదు జంతువులను కూడ కరోనా వైరస్ వదట్లేదు. ఓ పులికి కూడ కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అమెరికా అతలాకుతలం అవుతోంది.


న్యూయార్క్: అమెరికాలో మనుషులనే కాదు జంతువులను కూడ కరోనా వైరస్ వదట్లేదు. ఓ పులికి కూడ కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అమెరికా అతలాకుతలం అవుతోంది.

అమెరికాలోని న్యూయార్క్ బ్రాంగ్జ్ జూపార్క్ లో ఓ పులికి కరోనా సోకింది. ఈ జూలో నదియా అనే నాలుగేళ్ల పులికి ఈ వ్యాధి సోకినట్టుగా అమెరికా అధికారులు ఆదివారం నాడు ప్రకటించారు.

Latest Videos

జూలో  జంతువుల బాగోగులు చూసేందుకు నియమించిన వ్యక్తుల నుండి ఈ పులికి కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ పులితో పాటు  మరో పులికి మూడు ఆఫ్రికా సింహల్లో కూడ వైరస్ లక్షణాలు కూడ కన్పిస్తున్నాయని  జూ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ సోకిన జంతువులకు చికిత్స నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ జంతువులన్నీ కోలుకొంటాయని జంతు ప్రేమికులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

also read:తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ఈ వైరస్ సోకడంతో పులి  ఆహారం తగ్గించిందని జూ అధికారులు గుర్తించారు. జంతువుల్లో వైరస్ ఎలా వృద్ధి చెందుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు ప్రకటించారు. 

జంతువులపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్టుగా వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

 

click me!