కరోనా చిచ్చు... భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న ట్రంప్

By telugu news team  |  First Published Apr 7, 2020, 9:47 AM IST

ఇటీవల ట్రంప్ ఫోన్ చేసి మరీ తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని కోరగా... భారత్ నిరాకరించింది. దాని తర్వాతే ఆ మందు ఎగమతులపై నిషేధం కూడా విధించింది.
 


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ ప్రభావం అమెరికాలో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అమెరికాలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ఎంత దారుణంగా ఉందంటే....క‌రోనా దెబ్బకు అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది. 

Also Read పరిస్థితి విషమం: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్...

Latest Videos

న్యూయార్క్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దేశంలో ఇప్పటి వరకు ప‌ది వేల మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు. ఇదిలా ఉండే.. అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. 

అయితే మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల ట్రంప్ ఫోన్ చేసి మరీ తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని కోరగా... భారత్ నిరాకరించింది. దాని తర్వాతే ఆ మందు ఎగమతులపై నిషేధం కూడా విధించింది.

ఇదే మందు భారత్ కి కూడా అవసరం ఉండటంతో... ఇతర దేశాలను ఎగుమతిని నిలిపివేసింది. ఈ క్రమంలో..భారత్- అమెరికా మధ్య కరోనా మందు చిచ్చుపెట్టినట్లయ్యింది.

భారత్ డ్రగ్ ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రంప్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా చెప్పడం గమనార్హం.

ట్రంప్ మాట్లాడుతూ...ఒకవేళ ఔషదాలను సరఫరా చేయవద్దనేదే మోదీ నిర్ణయమైతే.. అది తన తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని ట్రంప్ అన్నారు. ఆదివారం తాను మోదీతో మాట్లాడనని చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషద అవసరం తమకు ఎంత ఉందో వివరించానని చెప్పారు.

అమెరికాకు ఆ ఔషదాన్ని సరఫరా చేయాలని కోరినట్లు చెప్పారు. నిషేదం ఎత్తివేయకపోతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఆయన చెప్పడం గమనార్హం.

click me!