మరోసారి ట్రంప్ కి కరోనా పరీక్షలు

By telugu news team  |  First Published Apr 3, 2020, 10:38 AM IST

కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తుంది. దాదాపు మూడు లక్షల మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 6వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తనకు కూడా వైరస్ సోకిందేమో అనే అనుమానం ట్రంప్ కి కలిగింది. ఆ భయంతోనే ఆయన రెండో సారి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి మరోసారి కరోనా పరీక్షలు చేశారు. ఈ సారి చేసిన పరీక్ష అత్యాధునిక పద్ధతిలో అబాట్ ల్యాబొరేటరీ నిర్వహించింది. 15 నిమిషాలు/ అంతకన్నా తక్కువ సమయంలోనే రిపోర్ట్ వచ్చింది. రెండోసారి పరీక్షలోనే ట్రంప్‌కు నెగిటివే వచ్చింది.

గతనెలలో బ్రెజిల్ అధికారితో సంప్రదింపులు జరిపాక.. కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు ట్రంప్. అప్పుడు నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. రెండోసారి చేసిన పరీక్ష వేగంగా వచ్చిన.. తనలో మాత్రం టెన్షన్ తగ్గలేదని చెప్పారు. రెండోసారి కూడా ట్రంప్‌కు కరోనా వైరస్ నెగిటివ్ వచ్చింది.

Latest Videos

Also Read కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం...

కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తుంది. దాదాపు మూడు లక్షల మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 6వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తనకు కూడా వైరస్ సోకిందేమో అనే అనుమానం ట్రంప్ కి కలిగింది. ఆ భయంతోనే ఆయన రెండో సారి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ లో పనిచేసే ఓ అధికారికి కూడా కరోనా సోకడం గమనార్హం. పలు దేశాల్లో దేశాధి నేతలు, ఉన్నతాధి కారులకు కూడా కరోనా సోకింది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ట్రంప్ ఈ పరీక్షలు చేయించుకున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా ట్రంప్ పరీక్షలు చేయించుకున్నారు.

ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ట్రంప్.. కరోనా సోకిన ఇద్దరు ప్రతినిధులను కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే... ట్రంప్ ని కలిసే సమయానికి సదరు ఇద్దరు ప్రతినిధులకు ఇంకా వైరస్ నిర్థారణ కాకపోవడం గమనార్హం.


 

click me!