అమెరికాలో కరోనా విజృంభణ... చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్న ట్రంప్

By telugu news teamFirst Published Mar 27, 2020, 11:18 AM IST
Highlights

ప్రస్తుతం అమెరికాలో 81,896 మందికి కరోనా సోకడం గమనార్హం. చైనాలో 81,285 కేసులు ఉండగా.. ఇటలీలో 80,589 మంది కరోనా బాధితులు ఉన్నారు. యూఎస్ లో కొత్తగా 13,685 కేసులు నమోదయ్యాయి. దానిని బట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా... ఇప్పటి వరకు అగ్ర రాజ్యంలో 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్ అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ తొలుత చైనాలో ప్రారంభమైనప్పటికీ... దాని ప్రభావం ఇప్పుడు అమెరికాలో ఎక్కువ చూపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం చైనా, ఇటలీ, స్పెయిన్ లను దాటేసి... అమెరికా తొలి స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రస్తుతం అమెరికాలో 81,896 మందికి కరోనా సోకడం గమనార్హం. చైనాలో 81,285 కేసులు ఉండగా.. ఇటలీలో 80,589 మంది కరోనా బాధితులు ఉన్నారు. యూఎస్ లో కొత్తగా 13,685 కేసులు నమోదయ్యాయి. దానిని బట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా... ఇప్పటి వరకు అగ్ర రాజ్యంలో 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదముద్ర కూడా వేశారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. 

Also Read చైనా ని దాటేసిన అమెరికా... కరోనా కేసుల్లో మొదటి స్థానం..

అమెరికా పరిస్థితి దారుణంగా మారడంతో అధ్యక్షుడు ట్రంప్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9:00 గంటలకు జితో మాట్లాడుతున్నట్లు ట్రంప్ విలేకరుల సమావేశంలో చెప్పారు. 

82,404 సంక్రమణ కేసులతో, యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు వైరస్ హాట్‌స్పాట్‌ లైన చైనా మరియు ఇటలీని అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నడుపుతున్న ట్రాకర్ తెలిపింది. అయితే ట్రంప్ దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ, "చైనాలో సంఖ్యలు ఏమిటో మీకు తెలియదు" అని అన్నారు. జి గ్లోబల్ ప్రతినిధుల తో కలిసి మహమ్మారి గురించి చర్చిస్తానని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అమెరికా సైనికులు చైనాకు వైరస్ తెచ్చారని తద్వారా కుట్ర సిద్ధాంతానికి తెరలేపారని చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ వైరస్ చైనా నుండే వచ్చిందని పేర్కొన్నారు.

click me!