కరోనా సోకి లండన్ లో... 13ఏళ్ల బాలుడు మృతి

By telugu news teamFirst Published Apr 1, 2020, 11:38 AM IST
Highlights

లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ లో బాలుడు చనిపోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అయితే.. బ్రిటన్ లో కరోనా వైరస్ కారణంగా పలువురు చనిపోగా... అతి చిన్న వయసు కుర్రాడు ఇతనేనని అధికారులు చెప్పారు. 

కరోనా వైరస్ సోకి 13ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం బాలుడికి కరోనా సోకినట్లు గుర్తించగా... సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా... బాలుడికి గతంలో ఎలాంటి అనారోగ్యం లేదని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్పారు.

లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ లో బాలుడు చనిపోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అయితే.. బ్రిటన్ లో కరోనా వైరస్ కారణంగా పలువురు చనిపోగా... అతి చిన్న వయసు కుర్రాడు ఇతనేనని అధికారులు చెప్పారు. 

Also Read హెచ్ఐవీ నివారణకు పోరాడి.. కరోనా వైరస్ సోకి......

కాగా.. బెల్జియంలో 12ఏళ్ల మైనర్ బాలిక కూడా కరోనా వైరస్ కారణంగానే మృతి చెందడం గమనార్హం. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమ కుమారుడు.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడని చెప్పారు. దీంతో వెంటనే అనుమానంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు.

పరీక్షించిన వైద్యులు కరోనాగా గుర్తించారు. ఈ క్రమంలో.. బాలుడు సోమవారం కన్నుమూశాడు. కాగా... ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుడు వెంటనే కోమాలోకి వెళ్లాడని.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా లాభం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు.

click me!