ఏప్రిల్ 7వ తేదీలోగా తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త కరోనా ా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఏప్రిల్ లోగా తెలంగాణ కోరనా వైరస్ ఫ్రీ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ఏ తేదీన ఎంత మంది వ్యాధిగ్రస్తులు కోరనా నుంచి ఫ్రీ అవుతారనే లెక్కలు కూడా ఆయన చెప్పారు.మార్చి 30వ తేదీ నాటికి క్వారంటైన్ ఫ్రీ అవుతుందని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 11 మంది కోరనా నుంచి కోలుకున్నారని, వారిని మరోసారి పరీక్షించి రేపు డిశ్చార్జీ చేస్తారని ఆయన చెప్పారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 70 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. కోరనా వ్యాధిగ్రస్తులందరూ కోలుకుంటున్నారని, ఒక్క వృద్ధుడికి మాత్రమే ప్రమాదం ఉందని, అతనికి ఇతర వ్యాధులు ఉన్నాయని, ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రం కరోనా ప్రీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 30 వేల కోట్ల రూపాయలు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలోనూ ఈ విధంగా చేయలేదని ఆయన చెప్పారు.
undefined
క్వారంటైన్ లో ఉన్నవారని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7వ తేదీకి ఫ్రీ అవుతామని ఆయన చెప్పారు. కొత్త కేసులు వచ్చే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, ఇతర రవాణా సౌకర్యాలు బందయ్యాయని, బయటి నుంచి వ్యక్తులు వచ్చే అవకాశం లేదని, అందువల్ల తెలంగాణలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు.
స్థానికంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వారిని పట్టుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించామని ఆయన చెప్పారు. కొత్తగూడెం, కరీంనగనర్ ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. అనుమానితులు 25,937 మంది ఉన్నారని, వారందరికి కూడా పరీక్షలు పూర్తవుతాయని ఆయన చెప్పారు. అయితే, లాక్ డౌన్ నియమాలను అనుసరిస్తూ స్వీయ నియంత్రణ పాటించడమే మార్గమని ఆయన చెప్పారు.
తాను చాలా మెడికల్ సైన్స్ మ్యాజైన్ చదివానని, అందులో మన దేశం గురించి రాశారని, మన దేశంలో వైద్య సదుపాయాలు తక్కువ కాబట్టి తెలివిగా వ్యవహరించిందని రాశారని, లాక్ డౌన్ ద్వారా ప్రజలు గుమి కూడకుండా చూడడం ద్వారా దాన్ని సమర్థంగా ఎదర్కుంటోందని రాశారని ఆయన చెప్పారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని ఆయన అన్నారు. దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి వల్ల 59 వేల మందికి అంటిందని, అంత ప్రమాదకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. అందువల్ల గుంపులుగా చేరకపోవడమే ఆయుధమని ఆయన అన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారని కూడా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
రైతులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. వందకు వంద శాతం మార్కెట్ యార్డులను మూసేశామని ఆయన చెప్పారు. నియంత్రణ కూపన్ల ద్వారా అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కొంటారని ఆయన చెప్పారు. బీహార్ నుంచి కూలీలను రప్పిస్తామని ఆయన చెప్పారు. కూపన్లు ఇస్తారని ఆయన చెప్పారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట ఉందని ఆయన చెప్పారు. కూపన్లకు అనుగుణంగానే రైతులు రావాలని ఆయన చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే తేడా లేదని, సమన్వయం చేసుకుని పనిచేయాల్సిందేనని కేసీఆర్ అన్నారు. వలస కూలీలు ఆకలితో అలమటించకూడదని, వారికి మ్యారేజీ హాల్స్ లో భోజనాలు వండిపెడుతామని చెప్పారు. వారికి భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య మన వద్ద ఉందని ఆయన చెప్పారు.
కోరనాపై ఎంత కాలం యుద్ధం చేయాల్సి వస్తుందో చెప్పలేమని ఆయన చెప్పారు, కరోనా కట్టడికి కఠిన నియమాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. రిటైర్డ్ వైద్యులను, సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటాంని ఆయనయ చెప్పారు