లాక్ డౌన్ పై కేసీఆర్ ఎఫెక్ట్: కర్ర పట్టుకుని వీధిలోకి దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

By telugu team  |  First Published Mar 25, 2020, 3:03 PM IST

లాక్ డౌన్ అమలు కావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కర్ర పట్టుకుని వీధిలోకి దిగారు.


మహబూబ్ నగర్: లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రతి ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన సూచన బాగానే పనిచేస్తున్నట్లు ఉంది. మంత్రి శ్రీనివాస గౌడ్ కర్ర పట్టుకుని రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ లో ఆయన లాక్ డౌన్ అమలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజలకు ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు. ఆయన విజ్ఞప్తి పూర్తి పాఠం కింద ఇస్తున్నాం.

"దయచేసి చెప్తున్నా... ప్రజలు ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకి రావొద్దు. మీకు కావలసిన నిత్యవసర వస్తువులు.. కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.ఉదయం 10 గంటల తర్వాత ఎవ్వరు కూడా ఇల్లు వదిలి బయటకు రావద్దు..ఒకవేళ వస్తే కఠినంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులను ఆదేశిస్తున్నా..  ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు ముంబాయి.. పూణే. ఇతర రాష్ట్రాల నుంచి మూడు నాలుగు వేల మంది వచ్చినట్లు సమాచారం ఉంది.

Latest Videos

అదేవిధంగా దాదాపు 350 మందికి పైగా విదేశాల నుంచి మన జిల్లాకు వచ్చారు.. వీరిలో కరోనా వైరస్ ఎంతమందికి ఉందో తెలియని పరిస్థితి.. వీరు బహిరంగంగా తిరిగితే పరిస్థితి వచ్చు చేయి దాటి పోవచ్చు.. కావున అప్రమత్తంగా ఉండండి.ఇతర దేశాలలో కనిపిస్తే కాల్చివేత... జైల్లో పెట్టడం లాంటి చట్టాలను తీసుకువస్తున్నారు.. కానీ మనదేశంలో.. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మీరు వింటారనే ఉద్దేశంతో  ఇంకా కఠినంగా తీసుకురావడం లేదు.. ఆ పరిస్థితికి తీసుకురాకండి.

మీ ఇంట్లో ఉండి రోగం బారిన పడకుండా జాగ్రత్త వహించండి.. రోగంతో చనిపోతే.. శవాన్ని పూడ్చేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. కనుక ఆలోచించండి.. దయచేసి చెప్తున్నా..ఇంటికే పరిమితం కండి.రేపటి నుంచి అబ్దుల్ ఖాదర్ దర్గా.. బస్టాండ్... డైట్ కాలేజీ ప్రాంతాలలో 3 రైతు బజార్ లను ఏర్పాటు చేస్తాం.. వినియోగించుకోండి.

వ్యాపారులు అధిక ధరలకు సరుకులు అమ్మితే పీడీ యాక్ట్ పెడతాం... ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే.. పాస్ పోర్ట్ రద్దు చేస్తాం...మీ కోసం... మీ భవిష్యత్తు కోసం... ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది.. ఆలోచించండి మీలో ఎవరికైనా అనారోగ్యం వస్తే పోలీసుల సహకారం తీసుకోండి".

click me!