కొత్తగూడెంను ప్రమాదంలోకి నెట్టిన డిఎస్పీనిర్వాకం: ముగ్గురికి కరోనా

By telugu teamFirst Published Mar 25, 2020, 10:44 AM IST
Highlights

డిఎస్పీ నిర్వాకం వల్ల కొత్తగూడెం ప్రాంతం ప్రమాదంలో పడింది. లండన్ నుంచి వచ్చిన తన కుమారుడిని హోమ్ క్వారంటైన్ చేయకపోవడంతో ముగ్గురు ప్రమాదంలో పడ్డారు. డీఎస్పీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కొత్తగూడెం: తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతాన్ని డీఎస్పీ అలీ తన నిర్వాకంతో ప్రమాదంలోకి నెట్టారు. లండన్ నుంచి వచ్చిన కుమారుడిని క్వారంటైన్ చేయకుండా వేడులకు, ఇతర కార్యక్రమాలకు పంపించాడు. అంతేకాకుండా ఇంట్లో విందు కూడా ఇచ్చాడు. దీంతో కొత్తగూడెంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు బయపడ్డాయి.

లండన్ నుంచి వచ్చిన డిఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలగా, డీఎస్పీ కూడా అది అంటుకుంది. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

డిఎస్పీ ఇంటి పనిమనిషి భర్తను, నెలల పాపను పరీక్షల నిమిత్తం హైదరాబాదుకు తరలించారు. డీఎస్పీ తనయుడికి కాంటాక్టులోకి వచ్చిన 21 మందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తన కుమారుడిని హోమ్ క్యారంటైన్ చేయకుండా బయటకు పంపించిన డీఎస్పీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు. అయితే, నిర్లక్ష్యానికి డీఎస్పీ అలీపై ఏ  విధమైన చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 

తెలంగాణలో ఇప్పటి వరకు 39 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెంలోనే మూడు కేసులు నమోదు కావడం గమనార్హం. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే అది జరిగింది. కొత్తగూడెం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉంది.

click me!