కోవిడ్-19 కేసుల సంఖ్య, ఇతర సంబంధిత గణాంకాలు, అధికారిక గణాంకాలపై సమాచారం అలాగే ప్రజలు వైద్య పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, అనవసరమైన భయాందోళనలను నివారించడానికి ఆమోదించిన జాగ్రత్తలపై సమాచారం తెలుసుకోవచ్చు.
హైదరాబాద్: కోవిడ్ 19 (కరోనా వైరస్ ) వైరస్ మహమ్మారి వల్ల కలిగే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది, ఎందుకంటే దీని వల్ల ఇతరులకు సంక్రమణ అలాగే కరోనా వైరస్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరగడం ప్రర్పంభమయ్యాయి.
ఇలాంటి పరిస్థితిని పరిష్కరించడంలో పౌరులు ప్రభుత్వ విభాగాలకు సహాయం చేయడానికి, ఆరోగ్య, ఐటిఇ & సి విభాగాలు హైదరాబాద్ ఆధారిత స్టార్ట్-అప్ అయిన ఏడబల్యూఎస్, సిస్కో, క్వాంటెలా సహకారంతో మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయి.
ఈ యాప్ ప్రజలకు కోవిడ్-19 గురించి ఒక ఖచ్చితమైన సమాచారాన్ని అందితుంది అలాగే నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడుతుంది. ఐటిఈ & సి, ఎంఏ&యూడి, పరిశ్రమల గౌరవ మంత్రి శ్రీ కె.టి.రామారావు దీనిని 11 ఏప్రిల్ 2020 న ప్రారంభించారు.
అప్లికేషన్ ముఖ్య కార్యాచరణలు:
కోవిడ్-19 కేసుల సంఖ్య, ఇతర సంబంధిత గణాంకాలు, అధికారిక గణాంకాలపై సమాచారం అలాగే ప్రజలు వైద్య పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, అనవసరమైన భయాందోళనలను నివారించడానికి ఆమోదించిన జాగ్రత్తలపై సమాచారం తెలుసుకోవచ్చు.
also read ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌లో ఇబ్బందులు...99.8 శాతం ఇంటి వద్ద పని చేయలేరని తాజా సర్వే వెల్లడి...
ఈ యాప్ ద్వారా రోగికి వైద్య నిపుణుడితో అపాయింట్‌మెంట్‌ను కూడా రిమోట్‌గా బుక్ చేసుకోవడానికి సహకరిస్తుంది. అదనంగా, పరీక్షా కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్ల గురించి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా బులెటన్లు, ప్రభుత్వ ప్రకటనలు, అవసరమైన సేవల జాబితాకు సంబంధించిన మొత్తం సమాచారం కూడా ఇందులో తెలుసుకోవచ్చు.
24x7 అత్యవసర హెల్ప్‌లైన్‌తో నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఒకే క్లిక్ తో డబల్యూహెచ్‌ఓ, ఇతర ప్రపంచ ఆరోగ్య సంస్థలు సూచించిన అన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోవచ్చు. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి సందర్శించిన ప్రదేశాలను గుర్తించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.
ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి:
లింక్ 1 (Android):https://play.google.com/store/apps/details?id=com.tsstate.citizen
లింక్ 2 (iOS):పై క్లిక్ చేయండి.
"మొబైల్ యాప్ ద్వారా ప్రజలు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ సాధనాలతో వెంటనే స్పందించడానికి వీలు కల్పిస్తుంది." అని క్వాంటెలా వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ అన్నారు. "ఇది ఆల్ ఇన్ వన్ యాప్, ఇది అధికారిక సమాచారం, ముందు జాగ్రత్త చర్యలను, అనేక ఇతర సేవలను ఒకే వేదికపై ప్రజల ప్రయోజనార్థం కోసం అందిస్తుంది" అని గౌరవ మంత్రి కె.టి.రామారావు గారు అన్నారు.