బాయ్ ఫ్రెండ్ బ్రేక్ అప్ చెప్పాడు, తేల్చుకోవాలి... అనుమతివ్వండి: పోలీస్ స్టేషన్ కి యువతీ

By Sree sFirst Published Apr 7, 2020, 9:08 AM IST
Highlights

సోమవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన యువతి, తన బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు పర్మిషన్ కావాలని అభ్యర్థనతో వచ్చింది. ఈ అభ్యర్థన విన్న పోలీసులు అవాక్కయ్యారు. 

కరోనా వైరస్ కి మందు ఇంకా లేకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ ఒక్కటే శరణ్యంగా ప్రకటించి ఈ మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ భగవంతుడ్ని పోరార్తిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మంత్రమే లాక్ డౌన్ అయినప్పుడు, అగ్రరాజ్యాలను తలదన్నే వైద్యసేవలు మనవద్ద లేకపోవడంతో మనదేశం కూడా 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. 

తెలంగాణలో కూడా ఇలా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ... ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు 100 కు ఫోన్ చేయడం కానీ, సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ అవసరమైన పర్మిషన్లు పొందొచ్చని తెలిపింది. 

ఇలా పోలీస్ స్టేషన్ కి వస్తున్న కేసులను చూసి ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు బాదుకుంటున్నారు. వింత విచిత్రమైన రిక్వెస్టులతో పోలీస్ స్టేషన్లకు ప్రజలు వస్తున్నారు. 

ఇలాంటి ఒక సంఘటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన యువతి, తన బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు పర్మిషన్ కావాలని అభ్యర్థనతో వచ్చింది. ఈ అభ్యర్థన విన్న పోలీసులు అవాక్కయ్యారు. 

విషయమేంటో అడిగి తెలుసుకున్న పోలీసులు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆదివారం రోజున అంబర్ పెట్ నుంచి బంజారా హిల్స్ వరకు వచ్చాడు. ఈ అమ్మాయిని కలిసేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కలవారు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

ఆ సదరు యువకుడిని అక్కడ చూడడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేసారు. అక్కడకు చేరుకున్న పోలీసుల ముందే ఆ అమ్మాయంటే తనకు ఇష్టం లేదని, ఆ విషయం చెప్పేందుకే వచ్చానని ఒప్పుకున్నాడు. 

అయితే అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పోలీసులకు, తన తల్లిదండ్రులకు భయపడి అలా చెప్పి ఉంటాడని, తనను కలిసి ఒకసారి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆ అమ్మాయి కోరింది. ఈ బ్రేక్ అప్ వ్యవహారం తేల్చుకోవడం కోసం వచ్చిన అమ్మాయికి సర్ది చెప్పి పోలీసులు అక్కడి నుంచి ఇంటికి పంపించివేశారు. 

ఇకపోతే తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేసీఆర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేసులకు తోడు మహా అయితే మరో 100 లేదా 115 కేసులు రిపోర్ట్ అయ్యే ఆస్కారముందని(ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ ప్రకారం, పూర్తి స్థాయి రిపోర్టులు ఇంకా అందలేదు) అక్కడితో ఆగితే తెలంగాణ సమాజానికి మేలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇక కేసీఆర్ మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాధి కట్టడిలో తాము గణనీయమైన విజయం సాధించినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ప్రస్తుతం 308 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో మొత్తం 364 మందికి కరోనా పాజిటివ్ రాగా, 45 మంది డిశ్చార్జి అయ్యారని ఆయన చెప్పారు. 

click me!