కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కాలాన్ని పెయిడ్ హాలిడేస్ గా పరిగణించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: లాక్ డౌన్ రోజులకు వేతనాలు రావనే భయం ఇక తెలంగాణ ఉద్యోగులకు భయం అక్కర్లేదు. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లాక్ డౌన్ రోజులను పెయిడ్ హాలిడేస్ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారంనాడు ప్రటించారు
శుక్రవారం ఒక్క రోజే పది కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి పెరిగాయి. ప్రతి రోజూ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తూనే ఉన్నారు
undefined
ఒక్క రోజే రాష్ట్రంలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. మరో 25 వేల మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
లాక్ డౌన్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన విషయం తెలిసిందే
కరోనాకు ప్రపంచంలోనే మందు లేదని, సోషల్ డిస్టాన్స్ పాటించడమే మార్గమని ఆయన చెప్పారు.
ఐసోలేషన్ వార్డులో 11 వేల మందిని పెట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు 60 వేల మంది వ్యాధికి గురైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వంద మంది అవసరమైతే 130 మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని అన్నారు. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన అన్నారు. తాము వంద శాతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.