రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది: కేసీఆర్

By narsimha lode  |  First Published Mar 26, 2021, 1:45 PM IST

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.



హైదరాబాద్:రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.శుక్రవారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

 కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ప్రారంభిస్తే బీజేపీ దీన్ని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ప్రతి అంశాన్ని కేంద్రం తన చేతిలోకి తీసుకోవాలని చూస్తోందన్నారు.రాష్ట్రాలకు ఇవ్వాల్సిందిపోయి తీసుకొంటున్నారని ఆయన కేంద్రం తీరుపై మండిపడ్డారు.

Latest Videos

సభలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదని ఆయన ఆరోపించారు. ఒక్క నిర్మాణాత్మక సూచన  ఒక్కటీ కూడ ఇవ్వడం లేదన్నారు. చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. ప్రతీదాన్ని విమర్శించడమే పనిగా విపక్షాలు పెట్టుకొన్నాయని ఆయన మండిపడ్డారు.భట్టి విక్రమార్క తలసరి ఆధాయాల కథ పెద్దగా చెప్పారన్నారు.బడ్జెట్ వంద కోట్ల నుండి లక్షల కోట్లకు చేరుకొందన్నారు. త్వరలోనే 57 ఏళ్లు నిండినవారికి వృద్ధాప్య పెన్షన్లు అందిస్తామని ఆయన చెప్పారు.

తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హమీలను  ఏ రకంగా అమలు చేశామో పెన్షన్ విషయంలో కూడ వాటిని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
 

click me!