తెలంగాణ ప్రజలు కాదు... కేసీఆరే పెద్ద కుక్క: పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

Arun Kumar P   | Asianet News
Published : Feb 11, 2021, 02:13 PM ISTUpdated : Feb 11, 2021, 02:20 PM IST
తెలంగాణ ప్రజలు కాదు... కేసీఆరే పెద్ద కుక్క: పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

బుధవారం టీఆర్ఎస్ సభలో నిరసనకారులను ఉద్దేశిస్తూ సీఎం కుక్కలు అని సంబోధించడాన్ని మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. 

వరంగల్: బుధవారం నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా కొందరు నినాదాలతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నిరసనకారులను ఉద్దేశిస్తూ సీఎం కుక్కలు అని సంబోధించడాన్ని మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలే అయిన నిరసనకారులను కుక్కలతో పోల్చడమంటే యావత్ తెలంగాణ ప్రజలను పోల్చినట్లేనని మండిపడ్డారు. నిజానికి కేసీఆరే పెద్ద కుక్క అని పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గురువారం భీమదేవరపల్లి మండలంలో పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామంటే సీఎం ఎక్కడా దొరకడం లేదన్నారు. ప్రగతి భవన్,   ఫాంహౌస్ లో కూడా కేసీఆర్ దొరక్కపోవడంతో టీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చి వుంటారన్నారు. ఇలా సమస్యలు చెప్పుకుందామని సభకు వస్తే ప్రజలను కుక్కలతో పోల్చుతావా అని కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసీఆర్ బహిరంగం  క్షమాపణ‌లు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. 

read more   హలియాలో కేసీఆర్ సభ: బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకుంటే ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు.  అంత:పుర కలహాలకు వేదికగా ప్రగతిభవన్ మారిందని పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్‌ను కొడుకు కేటీఆర్ బాధ్యతగా ఫాగల్ ఆసుపత్రికి చికిత్స చేయించాలని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Budget 2025 : కొత్త వ్యవసాయ పథకం , తెలుగు రైతులకు బంపరాఫర్, ఫుల్ డిటైల్స్
 తెలంగాణలో దడపుట్టిస్తున్న కరోనా .. తాజాగా 4 కేసులు నమోదు