కరీంనగర్‌: రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

By Mahesh Rajamoni  |  First Published Jun 17, 2023, 10:46 AM IST

Karimnagar: కరీంనగర్ లో చోటుచేసుకున్న‌ ఘోర రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయ‌కుడు ఒక‌రు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, బీజేపీ నేత కొమురరెడ్డి ప్రాణాలు కోల్పోయార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 


BJP leader dies in road accident: కరీంనగర్ లో చోటుచేసుకున్న‌ ఘోర రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయ‌కుడు ఒక‌రు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, బీజేపీ నేత కొమురరెడ్డి ప్రాణాలు కోల్పోయార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. హుజూరాబాద్ మండలం కనుకులగిద్దే సర్పంచ్ గోపు కొమురరెడ్డి శనివారం తెల్లవారుజామున శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న కొమురరెడ్డి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Latest Videos

undefined

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడైన కొమురారెడ్డి గతంలో హుజూరాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఇతర పదవుల్లో పనిచేశారు. ఈటల రాజేందర్ అధికార పార్టీ విభేధాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం బీజేపీలో చేరారు. ఈట‌ల‌తో క‌లిసి కొమురారెడ్డి కూడా బీజేపీలో చేరారు.

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, మ‌నోవేద‌న‌తో తండ్రి.. 

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించిన కొన్ని గంటలకే మనోవేదనతో తండ్రి తన జీవితాన్ని ముగించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన వాంకిడి మండలం సామెల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వాంకిడి మండలం జైత్‌పూర్‌ క్రాస్‌రోడ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరాం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తులసీరామ్ తండ్రి భీమ్‌రావ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొడుకు మరణించిన కొన్ని గంటలకే సామెల గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఖమ్మంలో..

దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయి నలుగురు మృతిచెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ‌-ఏపీ సరిహద్దులో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి కిందపడిపోయింది. దీంతో అప్పటివరకు ఆనందోత్సాహాలతో సాగిన ప్రయాణం ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయింది. 

click me!