కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారతదేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ధికంగా బలంగా ఉన్న వారి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉన్నప్పటికీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల అవస్థలు వర్ణనాతీతం
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారతదేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ధికంగా బలంగా ఉన్న వారి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉన్నప్పటికీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల అవస్థలు వర్ణనాతీతం.
Also Readమరో మూడు కేసులు: తెలంగాణలో 44కు చేరిన పాజిటివ్ కేసులు
undefined
వీరిని ఆదుకునేందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేషన్, పప్పు, ఉప్పుతో పాటు కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిరుపేదలను ఆదుకునేందుకు స్వల్ప ధరకే గోధుమలు ఇవ్వాలని నిర్ణయించింది.
కొందరు సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొచ్చి వారిని ఆదుకుంటున్నాయి. ఈ క్రమంలో కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సాయం చేసేందుకు తన కుమారుల సూచనలు మేరకు ఓ రైతు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
Also Read:కేసీఆర్ సార్ మమ్మల్ని చావుకు వదిలేశారా? దయనీయ పరిస్థితులపై కరోనా బాధితురాలి వీడియో
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు అనే రైతు తిండి లేని నిరుపేదలకు రూ.50 ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తను చూసిన టీఆర్ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ రైతును ప్రశంసలతో ముంచెత్తారు. ‘అతను రియల్ హీరో.. చాలా ఇన్‌స్పైరింగ్’’ అని ట్వీట్ చేశారు.
True hero !! Very Inspiring !! pic.twitter.com/6pnPJTdEi6
— Kavitha Kalvakuntla (@RaoKavitha)