తెలంగాణలో 47కు చేరిన కోరనా కేసులు: ధ్రువీకరించిన ఈటెల

By telugu team  |  First Published Mar 27, 2020, 1:34 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 47కు చేరుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ధ్రువీకరించారు. ఆయన వైద్య కళాశాలల ప్రతినిధులతో మాట్లాడారు.


హైదరాబాద్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మెడికల్ కాలేజీల ప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారి వల్లనే కరోనా వ్యాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. 

Latest Videos

Also Read: లక్షణాలు లేకుండానే కరోనా.. బాధితుడు ఏం చెప్పాడంటే...

హైదరాబాదులోని డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. నగరంలోని దోమలగుడా ప్రాంతంలో ఉండే భార్యాభర్తలకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మేడ్చెల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అతను ఢిల్లీకి నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు. 

బుధవారంనాడు రెండు కేసులు నమోదయ్యాయి. మూడేళ్ల బాలుడికి, ఓ మహిళకు కోవిడ్ 19 సోకినట్లు నిర్ధారణ అయింది. హైదరాబాదులోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. బాలుడికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఆస్పత్రిలో చేర్చారు. 

Also Read: లాక్ డౌన్ ప్రభావం... ఒంటరితనాన్ని భరించలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య

కొద్ది రోజుల క్రితం లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధాణ అయింది. అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కొత్తగూడెం డీఎస్పీ నిర్వాకం వల్ల ముగ్గురు కరోనా బారిన పడ్డారు. 

click me!