లక్షణాలు లేకుండానే కరోనా.. బాధితుడు ఏం చెప్పాడంటే...

By telugu news teamFirst Published Mar 27, 2020, 12:26 PM IST
Highlights

తనకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే కరోనా సోకిందని ఓ బాధితుడు చెప్పడం గమనార్హం. తనకు ఎదురైన స్వీయ అనుభవాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దాని నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కరోనా లక్షణాలను ప్రజలకు వివరిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు. 

అయితే.. తనకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే కరోనా సోకిందని ఓ బాధితుడు చెప్పడం గమనార్హం. తనకు ఎదురైన స్వీయ అనుభవాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు.

Also Read కరోనా కలకలం.. ట్రక్కుల్లో 300మంది కార్మికులు...

‘ఇటీవల మార్చి 20న నేను లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. అప్పుడు నాకు ఎయిర్ పోర్టులో టెస్టులు చేశారు. వైద్యులు నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. నిజానికి అప్పటి వరకూ నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కానీ.. టెస్టుల తర్వాత నాకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఈ విషయం తెలిసిన వెంటనే.. నేనుకుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ని కలవకుండా.. సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తూ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’.. అని తెలిపాడు.  

దీంతో.. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించాడు. చాలా మంది ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకున్నారని.. తాను తన కళ్లారా చూశానని చెప్పడం గమనార్హం.క్వారంటైన్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందనే భయంతోనే వీరంతా అలా చేస్తున్నారని అతను చెప్పాడు.

click me!