వికారాబాదు జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ కీలకమైన ప్రకటన చేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎవరింటికైనా కొత్తవారు రాకూడదని, అలా వస్తే ఇంటి యజమానికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
వికారాబాద్: కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజరీబాద్ పంచాయతీ సర్పంచ్ కీలకమైన ప్రకటన చేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నవారి వద్దకు బంధువులు, స్నేహితులు ఎవరూ రాకూడదని హెచ్చరించారు. ఎపరైనా కొత్తగా వస్తే ఆ ఇంటి యజమానికి వేయి రూపాయలు జరిమానా వేస్తామని గ్రామ సర్పంచ్ హెచ్చరించారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. కేవలం అత్యవసరమైనవాటికి మాత్రమే బయటకు రావాలని సూచించారు. నిత్యావసర సరుకులు కూడా ఇంటికే వస్తాయని చెప్పారు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కీలకమై హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు లాక్ డౌన్ ను తీవ్రంగా తీసుకుని దాన్ని పాటించకపోతే ఆర్మీ దించుతామని, 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో సర్పంచ్ లు తమ తమ గ్రామాల్లో కరోనా కట్టడికి ఎలా పనిచేయాలనే విషయాన్ని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో నజీరాబాద్ సర్పంచ్ కీలకమైన ప్రకటన చేసినట్లు కనపిస్తున్నారు.
తెలంగాణలో మంగళవారంనాడు మరో మూడు కరోనా కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 39కి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
మంగళవారంనాడు నమోదైన కేసుల్లో మూడు కాంటాక్ట్ కేసులు కాగా, మూడు విదేశాల నుంచి వారి కేసులు. హైదరాబాదులోని మణికొండలో 64 వృద్ధురాలికి కోరనా అంటుకుంది. కాగా, కొత్తగూడెం డీఎస్పీ, ఆయన ఇంటి పనిమనిషి కరోనా బారిన పడ్డారు.
విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.
జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.