ఆదిలాబాద్‌లో సర్వేకు వెళ్లిన ఆశా వర్కర్లపై దాడికి యత్నం: రక్షణ కోసం ఆందోళన

By narsimha lode  |  First Published Apr 3, 2020, 5:05 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  కరోనా పాజిటివ్ కేసుల సర్వే కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై కొందరు శుక్రవారం నాడు దాడికి యత్నించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్లు ఆదిలాబాద్ డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  కరోనా పాజిటివ్ కేసుల సర్వే కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై కొందరు శుక్రవారం నాడు దాడికి యత్నించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్లు ఆదిలాబాద్ డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

విదేశాల నుండి వచ్చినవారితో పాటు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారి సమాచారాన్ని ఆశా వర్కర్లు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పట్టణంలో ఢిల్లీ నుండి వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో సమాచారాన్ని సేకరించేందుకు ఆశా వర్కర్లు వెళ్లారు. తనపై  ఆ కుటుంబసభ్యులు దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు.

Latest Videos

Also read:ఈ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్: ఫుల్ శాలరీ వేస్తామన్న తెలంగాణ సర్కార్

ఈ విషయం తెలుసుకొన్న మిగిలిన ఆశా వర్కర్లు కూడ జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. ప్రాణాలను ఫణంగా పెట్టుకొని తాము విధులు నిర్వహిస్తున్నామని ఆశా వర్కర్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమపై దాడులకు దిగడం సరైంది కాదని ఆశా వర్కర్లు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.

సర్వేకు వెళ్లే సమయంలో తమ వెంట పోలీసులను పంపాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ  విషయమై వైద్య శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని ఆశా వర్కర్లు చెబుతున్నారు.

 


 

click me!