కరోనా: ఢిల్లీ వెళ్లిన విషయం దాచిన రిమ్స్ డాక్టర్, చర్యలకు సిఫారసు

By narsimha lode  |  First Published Apr 6, 2020, 3:19 PM IST


ఆదిలాబాద్ రిమ్స్  వైద్యుడు డాక్టర్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పెట్టినట్టుగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.



ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్  వైద్యుడు డాక్టర్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పెట్టినట్టుగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ అహ్మద్  పనిచేస్తున్నాడు. అయితే గత మాసంలో న్యూఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో ఆయన పాల్గొని వచ్చాడు. అయితే  ఈ విషయాన్ని ఆయన దాచిపెట్టాడు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

Latest Videos

undefined

వెంటనే డాక్టర్ అహ్మద్ ను క్వారంటైన్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉంటున్నారు.  ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని దాచిపెట్టిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని  జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Also read:కరోనా: నిజామాబాద్‌లో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

తెలంగాణలో ఆదివారం నాడు రాత్రికి 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు ఒక్క రోజే 62 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే.  ఈ వ్యాధి బారినపడినవారిలో 33 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరో వైపు ఈ వ్యాధితో రాష్ట్రంలో 11 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నెల 14వ తేది వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

click me!