కరోనా ‘లాక్‌డౌన్’ వివిధ వర్గాల అవసరాల కోసం దూసుకొచ్చిన ‘జూమ్’ యాప్’తో పోటీ పడేందుకు ఫేస్ బుక్, దాని మెసేజింగ్ యాప్ ఆపసోపాలు పడుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్ 'మెసెంజర్ రూమ్స్' ఇక వాట్సాప్‌లో దర్శనం ఇవ్వనుంది. ఈ వెసులుబాటుతో వాట్సాప్ వెబ్ తెరిస్తే చాలు.. 50 మందితో ఒకేసారి వీడియోకాల్ మాట్లాడుకునే వెసులుబాటు లభిస్తుంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ టైంలో జూమ్ వంటి దిగ్గజ వీడియో కాన్ఫెరెన్సింగ్ యాప్‌లను తలదన్నేలా, ఫేస్‌బుక్ తీసుకొచ్చిన 'మెసెంజర్ రూమ్స్' త్వరలో వాట్సాప్ వెబ్‌లో కనిపించనున్నది. అవును..ఇది నిజం..
ఇక మీ ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లల్లో వాట్సప్ తెరిస్తే.. 'ఫైల్ అటాచ్ బటన్' కింద "ఈ మెసెంజర్ రూమ్స్" షార్ట్‌కట్ అందుబాటులోకి రానున్నది. గత నెల ఫేస్‌బుక్ సరికొత్త వీడియో కాన్ఫెరెన్సింగ్ టూల్‌ను విడుదల చేసింది. అదే 'మెసెంజర్ రూమ్స్'.
undefined
ఈ మెసెంజర్ రూమ్స్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్ మాట్లాడే సౌకర్యం ఉంటుంది. అయితే, ఈ మెసెంజర్ రూమ్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ లాగ్ఇన్ అవ్వాల్సిన అవసరం లేకుండా.. వాట్సప్ వెబ్ వెర్షన్లో కనిపించేలా ఫేస్‌బుక్ ఏర్పాటు చేస్తోంది.
also read చైనాకు షాక్: ఆపిల్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హబ్ ఇండియా..
దీంతో వాట్సప్ నుంచే మెసెంజర్ రూమ్స్ ద్వారా 50 మందితో వీడియోకాల్ మాట్లొడొచ్చు. అధికారిక నివేదిక ప్రకారం.. ఈ మెసెంజర్ రూమ్స్ షార్ట్‌కట్ వచ్చేనెల రెండో తేదీ నుంచి వాట్సాప్ వెబ్‌లో కనిపిస్తుంది.
ఇందులో వాట్సాప్ గ్రూప్ సృష్టించినట్లే మెసెంజర్ రూమ్ క్రియేట్ చేసుకుని వీడియోకాలింగ్ కోసం స్నేహితులను ఇన్వైట్ చేయొచ్చు. అంతే కాదు, న్యూస్‌ఫీడ్, గ్రూప్స్, ఈవెంట్ పేజీలలో లింక్స్ కూడా షేర్ చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఏ ఒక్కదాన్ని ఓపెన్ చేసినా ఫేస్ బుక్ మెసేంజర్స్ రూమ్‌లోకి ఎంట్రీ అయిపోవచ్చు. ఇప్పటికే ఫేస్ బుక్ మెసేంజర్స్ రూమ్ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్‌లో గత వారం ఎంటరైంది. అదే పద్దతుల్లో వాట్సాప్ వెబ్ లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.