యూపీలో తొలి కరోనా మరణం.. ముంబయి వెళ్లిన విషయం దాచి...

By telugu news teamFirst Published Apr 1, 2020, 12:56 PM IST
Highlights

ఎక్కడ క్వారంటైన్ లో ఉంచుతారో అనే భయంతో కుటుంబసభ్యులు కూడా నోరు విప్పలేదు. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాగా.. యువకుడి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దీనిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించినా ఎలాంటి ప్రయోజనం కనపడటం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పంజా విసురుతోంది. తాజాగా దేశంలో మరో కరోనా మరణం చోటు చేసుకుంది.

యూపీలో కరోనా వైరస్ కారణంగా ఒక యువకుడు మరణించాడు. బస్తీ జిల్లాకు చెందిన ఈ యువకుడు గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. సదరు యువకుడు ఇటీవల ముంబయిలో పర్యటించాడు. ఆ విషయాన్ని చెప్పకుండా దాచి పెట్టారు. 

Also Read ప్రభుత్వం తీరు: మన డాక్టర్లకు రైన్ కోట్లు, సెర్బియాకు మాత్రం ప్రొటెక్టీవ్ గేర్...

ఎక్కడ క్వారంటైన్ లో ఉంచుతారో అనే భయంతో కుటుంబసభ్యులు కూడా నోరు విప్పలేదు. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాగా.. యువకుడి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు యూపీలో కరోనా బారిన పడిన రోగుల సంఖ్య 103కు చేరుకుంది. మంగళవారం చివరి నాటికి మరో ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. 

ఇందులో బరేలీ నుండి ఐదుగురు, నోయిడా, ఘజియాబాద్ నుండి ఒక్కక్క రోగి ఉన్నారు. ఇప్పటివరకు నోయిడాలో గరిష్టంగా 39 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 261 అనుమానిత రోగులను ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటివరకు యూపీలోని 15 జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. యూపీలోని నోయిడాలో ఇప్పటివరకు నమోదైన 39 మంది కేసులలో  ఎక్కువ మంది సీస్ ఫైర్ అనే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. 

click me!