కరోనా రోగులకు చికిత్స.. ఇంటి బయటే డాక్టర్.. నెట్టింట ఫోటో వైరల్

By telugu news team  |  First Published Apr 1, 2020, 10:29 AM IST

 భోపాల్ కు చెందిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ దేహరియా చాలా రోజులుగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. డాక్టర్ సుధీర్ ఐదు రోజుల డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి, తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు. 


కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకీ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వారిని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఓ డాక్టర్ కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోని ఏకంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ షేర్ చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఒక దృశ్యం అందిరినీ ఆకట్టుకుంటోంది. భోపాల్ కు చెందిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ దేహరియా చాలా రోజులుగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. డాక్టర్ సుధీర్ ఐదు రోజుల డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి, తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు. 

Latest Videos

Also Read మహారాష్ట్రలో 300దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజే 72 మందికి...

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా డాక్టర్ సుధీర్ ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. డాక్టర్ సుధీర్ దేహరియా ఐదు రోజుల తరువాత ఇంటికి వచ్చి, ఇంటి బయటనే  కూర్చుని టీ తాగారు. బయటి నుండే తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. కనీసం ఇంట్లోకి కూడా ఆయన అడుగుపెట్టకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో  ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. దేశాన్ని కాపాడేందుకు వైద్యులు ఎంతలా కష్టపడుతున్నారో ఒక్క ఫోటో తో అర్థమౌతోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. భన్వరాల్‌ అనే కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హుస్నాగాబాద్‌ ప్రాంతం నుంచి ఉపాధి కోసం రాజస్తాన్‌కు వలస వెళ్లాడు. 

ఈ క్రమంలోనే పని ప్రదేశంలో ప్రమాదశాత్తు కాలు ఫ్యాక్చర్‌ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఓవైపు ఉపాధిలేక, మరోవైపు ఇంటికి పంపేందుకు డబ్బులులేక అవస్థలు పడుతున్నాడు. 

స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. ఇక చేసేందేమీ లేక కాలుకున్న సిమెంట్‌ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. 

సుమారు 245 కిలోమీటర్లు నడక ద్వారా రాజస్తాన్‌లోని తన నివాసానికి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై దీనిని చూసిన వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

 దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ ఫోటో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే.. ఇంకా చాలా మంది వలస కార్మికులు మార్గ మధ్యలో ప్రాణాలే కోల్పోతున్నారని అధికారులు చెబుతున్నారు. 

కొన్ని వారాల పాటు ఉన్నచోటే ఉంటే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న విషయాన్నివలస కార్మికులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్యలు ఎదురౌతున్నాయని అధికారులు చెబుతున్నారు.
 

click me!