లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారి కోసం జైళ్లు రెడీ

By Siva KodatiFirst Published Apr 1, 2020, 4:42 PM IST
Highlights

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లను దాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లను దాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినప్పటికీ కొందరు మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజుల్లో సహనం వహించిన పోలీసులు తర్వాతి నుంచి లాఠీలకు పని చెబుతున్నారు.

Also Read:నిన్న ఢిల్లీ అల్లర్లు, నేడు మర్కజ్: అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్... అజిత్ దోవల్

దొరికిన వారిని దొరికినట్లు బాదేస్తున్నారు. అలా అక్కడక్కడా పోలీసుల ఓవరాక్షన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి కొన్ని చోట్ల జైలు శిక్షలు విధిస్తున్నారు.

అలాంటి వారి కోసం పంజాబ్‌లోని లూథియానా అధికారులు తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6 వేల మందికి సరిపోయేలా నాలుగు ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమీషనర్ రాకేశ్ అగర్వాల్ వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే నిబంధనలను ఉల్లంఘించిన 200 మందిని ఈ జైళ్లకు తరలించామని అధికారులు పేర్కొన్నారు.

Also Read:మర్కజ్ చిక్కులు: ఐదు రైళ్లు ఇవే, వేలాది మంది ప్రయాణికులపై ఆరా

ఇక లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై దేశ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో 5 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. వీటిలో అత్యధికంగా 5106 బైకులు, 183 మూడు చక్రాల వాహనాలు, 263 కార్లను సీజ్ చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమీషనర్ తెలిపారు. 

click me!