ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనల కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏయే రాష్ట్రాలకు చెందిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారో వారి వివరాలను ట్రేస్ పనిలో పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వాలు
ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనల కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏయే రాష్ట్రాలకు చెందిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారో వారి వివరాలను ట్రేస్ పనిలో పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారిని తనిఖీ చేసి వీలైనంత త్వరగా వారిని దేశం నుంచి పంపించి వేయాలని పేర్కొంది. అలాగే వారిలో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు వుంటే చికిత్స అందజేయాలని సూచించింది.
Also Read:మార్చి 23నే మర్కజ్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక, వీడియో విడుదల
మిగిలిన వారిని అందుబాటులో వున్న విమానంలో పంపాలని, ఒకవేళ కుదరని పక్షంలో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది. వారిని భారతదేశానికి తీసుకొచ్చిన వారే ఆ ఖర్చులు భరించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
జమాత్‌కు వచ్చిన విదేశీ బృందాలు ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయని... వారు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం వుందని హెచ్చరించింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని.. అందువల్ల వీరికి స్క్రీనింగ్ అవసరం లేదని కేంద్రం సూచించింది.
Also Read:డాక్టర్‌కు కరోనా పాజటివ్: ఢిల్లీలో ఆసుపత్రి మూసివేత
మత ప్రార్థనల కోసం దేశానికి వచ్చిన దాదాపు 2,000 మంది విదేశీయులు పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు హోంశాఖ ప్రస్తావించింది. వారు ఆరు నెలల వరకు భారత్‌లో ఉండేందుకు అనుమతులు ఉన్నాయని తెలిపింది.
కాగా కేంద్రం ఆదేశాల మేరకు నిజాముద్దీన్ జమాత్‌కు వెళ్లొచ్చిన వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించాయి. పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్సలు అందిస్తుండగా.. మిగిలిన వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకా ఆచూకీ దొరకని వారి కోసం అధికారులు, పోలీసులు జల్లెడ పడుతున్నారు.