కరోనా వార్డులో టిక్ టాక్ చేసి వీడియోను పోస్ట్ చేసింది. ఆస్పత్రి వార్డులోనే శానిటైజేషన్ సిబ్బందితో కలిసి ఓ బాధాకరమైన పాటకు మూమెంట్స్ ఇచ్చింది. ఇది పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీంతో ఆమెతో కలిసి టిక్ టాక్ చేసిన సిబ్బందిపై అధికారులు వేటువేశారు. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఇది జరిగింది.
కరోనా మహమ్మారి ప్రాణాలను పిండేస్తోంది. ప్రప్రంచవ్యాప్తంగా వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఓ మహిళ తనకు ప్రాణాలు తీసే కరోనా సోకినా కూడా టిక్ టాక్ ని కూడా వదిలిపెట్టలేదు.
Also Read కరోనా మృతుడికి జనరల్ వార్డులో చికిత్స: అతని అబద్ధంతో ప్రమాదంలో ప్రాణాలు...
కరోనా వార్డులో టిక్ టాక్ చేసి వీడియోను పోస్ట్ చేసింది. ఆస్పత్రి వార్డులోనే శానిటైజేషన్ సిబ్బందితో కలిసి ఓ బాధాకరమైన పాటకు మూమెంట్స్ ఇచ్చింది. ఇది పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీంతో ఆమెతో కలిసి టిక్ టాక్ చేసిన సిబ్బందిపై అధికారులు వేటువేశారు. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఇది జరిగింది.
స్థానికంగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో పని చేసే ఆ మహిళ ఖాళీ సమయాల్లో టిక్ టాక్ చేస్తూ ఉండేది. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వచ్చిపడ్డారు. ఏది చేసినా వెంటనే వైరల్ అయ్యేది. కానీ మార్చి 26న అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరోనా పాజిటివ్‌గా తేలింది.
అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో నాలుగు గోడల మధ్య ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఏమి తోచక మార్చి 28న టిక్‌టాక్ వీడియో చేసింది. కరోనాతో తాను పడుతున్న బాధలను వివరించింది. దీంట్లో శానిటైజేషన్ చేసే ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. ఆమెకు సహకరించారనే కారణంతో వెంటనే వారిని విధుల నుంచి తొలగించారు. కాగా ఇటీవలే ఆమెకు వైరస్ సోకడంతో వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తున్నారు.