ఒకరు మరణం, 24 గంటల్లో మరోకరికి పాజిటివ్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో టెన్షన్

By Siva Kodati  |  First Published Apr 2, 2020, 3:42 PM IST

ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ అయిన ముంబై ధారవిలో 24 గంటల్లో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు


భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో కేరళ, మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 335కు చేరగా, 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ అయిన ముంబై ధారవిలో 24 గంటల్లో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బుధవారం కరోనా కారణంగా ధారవికి చెందిన ఓ వ్యక్తి మరణించారు.

Latest Videos

Also Read:ఎయిమ్స్ డాక్టర్ కు కరోనా: ఢిల్లీలో ఏడుగురు డాక్టర్లకు పాజిటివ్

56 ఏళ్ల ఓ వ్యక్తి కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం సాయంత్రం మరణించాడు. జ్వరం రావడంతో మార్చి 23న స్థానికంగా ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లాడు.

అయితే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో 26న సియాన్ ఆసుపత్రిలో చేరాడు. స్థానికంగా చిన్న బట్టల కొట్టు నడుపుకుంటూ.. ధారవిలోని ఎస్ఆర్ఏ బిల్డింగ్‌లో నివసిస్తున్నాడు.

Also Read:భారతీయుల భుజంపై మచ్చ.. డబ్ల్యూహెచ్‌వో ప్రయోగాలు: కరోనా నుంచి అదే కాపాడుతోందా..?

ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినప్పటికీ కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు మృతుడి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించారు. అలాగే అతని ఇల్లు ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి, పోలీసులను మోహరించారు. ఆ భవంతిలో 308 ఫ్లాట్స్, 91 దుకాణాలు ఉన్నాయి.

మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే ఒకరు మరణించడం, 24 గంటల్లో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో ధారవి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మురికివాడ సాంద్రత 5 చ.కి.మీ ఈ చిన్న ప్రాంతంలోనే పది లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని అంచనా. 
 

click me!