హ్యుందాయ్ కార్ల ఉత్పత్తి ప్రారంభం... రోజుకు 200 కార్లు..

By Sandra Ashok Kumar  |  First Published May 9, 2020, 4:51 PM IST

అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటమే కాకుండా సామాజిక దూరం 100% పాటిస్తూ చెన్నైలోని శ్రీపెరంబుదూర్ లోని హ్యుందాయ్  కంపెనీ ప్లాంట్లో కార్ల ఉత్పత్తి పున ప్రారంభమైంది.


కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న భారతదేశంలోని ఏకైక ప్లాంట్‌లో కార్ల తయారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు మార్చి 23 నుండి నిలిచిపోయాయి.

ప్లాంట్లో ఉత్పత్తి పున ప్రారంభమైన మొదటి రోజున కంపెనీ మొత్తం 200 కార్లను తయారు చేయగలిగింది. అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటమే కాకుండా సామాజిక దూరానికి 100% పాటించడం ద్వారా చేయగలిగామని  హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది.

Latest Videos

షిఫ్ట్ విధంగా కార్యకలాపాలలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో, ఈ నెలలో సుమారు 12,000 నుండి 13,000 యూనిట్ల కార్ల తయారీ చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది.

also read నష్టాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ..ఖర్చులు తగ్గించుకునేందుకు కోతలు..

ఈ వారం ప్రారంభంలో  భారతదేశం అంతటా ఉన్న హ్యుందాయ్ 255 షోరూమ్‌లు & వర్క్‌షాప్‌లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. మొదటి 2 రోజుల్లో కంపెనీ 4,000 కస్టమర్ ఎంక్వైరీలను, 500 కస్టమర్ బుకింగ్లను అందుకుంది అలాగే 170 కార్లను అమ్మడంలో విజయవంతమైంది.


హ్యుందాయ్ తన డీలర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లలో ఉద్యోగుల భద్రత, శానిటైజేషన్ పై కూడా పరిశీలిస్తోంది. కంపెనీ అన్ని డీలర్‌షిప్‌లకు 6.8 లక్షల ఫేస్ మస్కూలు, అలాగే 20,000 హాఫ్ లీటర్ & 1.5 లక్షల 100 మి.లీ సానిటైజర్ కేసులను వినియోగదారులకు, అమ్మకాలు, సేవ మరియు బ్యాకెండ్ సిబ్బందికి పంపిస్తోంది.
 

click me!