కరోనా వైరస్ మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ఆర్బీఐ ఫెసిలిటీ కల్పించింది. స్పెషల్ లిక్విడిటీ కింద రూ.50 వేల కోట్లు అందుబాటులో ఉంచింది. ఈ ఫండ్ వచ్చేనెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివిధ రంగాల స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థపైనా నేరుగా ఎఫెక్ట్ పడుతోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో మదుపులకు విలువ లేకుండా పోయింది. పలు సంస్థలు తమ పథకాలను నిలిపేస్తున్నాయి.
ఈ క్రమంలో ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ (ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్), ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి రూ. 50వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్నికలిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ సదుపాయం ఈ రోజు నుంచి మే 11వ తేదీవరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
also read లాక్‌డౌన్ పొడిగిస్తే పేదరికంలో కోట్ల మంది.. మాజీ గవర్నర్ ఆందోళన..
కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్ కింద, 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను నిర్ణీత రెపో రేటుతో ఆర్బీఐ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుండి మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి ఉంటుంది.
ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్, ఆన్-ట్యాప్ఓ, పెన్-ఎండెడ్, బ్యాంకులు సోమవారం- శుక్రవారం వరకు (సెలవులు మినహా) సంబంధిత నిధులు పొందటానికి తమ బిడ్లను సమర్పించవచ్చని ఆర్బీఐ తెలిపింది.
ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్ హెచ్‌టిఎం పోర్ట్‌ఫోలియోలో చేర్చడానికి అనుమతించిన మొత్తం పెట్టుబడిలో 25 శాతానికి మించి మెచ్యూరిటీ (హెచ్‌టిఎం) ఉంటుందని వెల్లడించింది.
ప్రస్తుత ఆర్ధిక ఒత్తిడిపై ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలతో మ్యూచువల్ ఫండ్ షేర్లన్నీ దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాల్లో ప్రయాణిస్తున్నాయి,