18 రోజుల్లో మహాభారత యుద్ధాన్నే గెలిచాం.. 21 రోజుల్లో కరోనాపై గెలవలేమా: మోడీ

By Siva Kodati  |  First Published Mar 25, 2020, 5:38 PM IST

ప్రస్తుతం యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బుధవారం వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన దేశ ప్రజలందరం కలిసి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు


ప్రస్తుతం యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బుధవారం వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన దేశ ప్రజలందరం కలిసి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

ఇంటి గడపు దాటకుండానే కరోనాను తరిమికొడదామని.. వైరస్‌పై ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 21 రోజుల తర్వాత మనం విజయం సాధించబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Videos

Also Read:కరోనా డేంజర్ బెల్స్.. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ : మోడీ

వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. సోషల్ డిస్టెన్స్ మన అలవాటుగా మారాలన్న ఆయన మనందరి కేరాఫ్ ఇల్లే కావాలని సూచించారు. మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో జయించామని.. 21 రోజుల్లో కరోనాను జయించలేమా అని ప్రధాని ప్రశ్నించారు.

ప్రపంచంలో కరోనా సోకిన వాళ్లలో లక్షమంది కోలుకున్నారని, దేశానికి మూడు వారాల డెడ్‌లైన్ ఉందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. అదే సమయంలో ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన ప్రధాని.. 27 మంది మృతులకు సంతాపం తెలిపారు. 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జనతా కర్ఫ్యూను పాటించి ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...

ఈ అర్ధరాత్రి నుంచి ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమని, ఒక రకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూని మించిన విధంగా ఉంటుందని మోడీ తెలిపారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ తరహా వాతావరణమని, ప్రతి ఒక్కరిని చేతులేత్తి వేండుకుంటున్నా ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు.

ఈ అర్థరాత్రి నుంచి ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్‌డౌన్‌లో ఉంటాయని మోడీ చెప్పారు. 21 రోజులు ఇళ్లల్లో ఉండకపోతే.. పరిస్ధితి చేయిదాటుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ 21 రోజుల బయటకు వెళ్లడమనేని మర్చిపోవాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని తెలిపారు. 
 

click me!