తాను తన భార్య మాటలు విని తాను ఇంట్లోనే ఉంటున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెబుతూ మీరు మీ హోం మినిస్టర్స్ మాట విని ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ముంబై: తాను తన శ్రీమతి మాట విని ఇంట్లోనే ఉన్నానని, మీరు కూడా మీ శ్రీమతుల మాట విని ఇళ్లలోనే ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. తాను శ్రీమతి ముఖ్యమంత్రి మాట విని ఇంటికే పరిమితమయ్యాయని, మీరు మీ హోం మినిస్టర్ మాట వినాలని ఆయన అన్నారు.
నిత్యావసర సరకులకు ఏ విధమైన ఇబ్పంది ఉండదని, ఆందోళన చెందవద్దని ఆయన ప్రజలకు సూచించారు. నిత్యావసర సరుకులకు ఏ విధమైన కొరత ఉండదని ఆయన చెప్పారు. అతిగా ఆహార పదార్థాలు కొనుక్కుని నిల్వ చేసుకోకూడదని ఆయన చెప్పారు
"నేను శ్రీమతి ముఖ్యమంత్రి మాట విని ఇంట్లోనే ఉన్నాను. మీరు మీ హోం మినిస్టర్ (భార్యల) మాట వినండి. నిత్యావసర సేవలు అందుబాటులో ఉన్నందున భయాందోళనలు అవసరం లేదు" అని ఉద్ధవ్ థాకరే అన్నారు.
దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 116కు చేరుకుంది. బుధవారం గుడి పడవ పర్వదినం ఉండడంతో ప్రజలు తమకు అవసరమైనవాటిని కొనుక్కునేందుకు మంగళవారం పెద్ద సంఖ్యలో బయటకు వవచ్చారు. దాంతో ఉద్ధవ్ థాకరే ప్రజలకు వీడియోలో మరాఠీ భాషలో ఆ విధంగా చెప్పారు.
ప్రజలు అష్ట దిగ్బంధనాన్ని తీవ్రంగా తీసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరారు. కరోనా వైరస్ ప్రభావితన నగరాల నుంచి తమ గ్రామాలకు ఎవరూ రాకుండా గ్రామాల ప్రజలు కాపలా కాస్తున్నారు.