ప్రధాని మోదీ తనకు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గతంలో తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ లాక్ డౌన్ లో సామాన్య ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు కూడా ఇబ్బందులుపడుతున్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించక తప్పదు.
ఈ నేపథ్యంలో... ప్రధాని మోదీ తనకు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గతంలో తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.
Also Read లాక్ డౌన్... ఆంధ్రప్రదేశ్ లో ఇరుక్కున్న కర్ణాటక విద్యార్థులు...
'ఆదివారం నిర్వహించిన మన్‌కీబాత్ కార్యక్రమం సందర్భంగా ప్రస్తుత సమయంలో నా ఫిట్‌నెస్ దినచర్య గురించి ఒకరు నన్ను అడిగారు. అందుకే యోగా వీడియోలను షేర్ చేయాలనే ఆలోచన వచ్చింది. మీరందరూ కూడా యోగాను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నానని' మోదీ ట్వీట్ చేశారు. తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ఆయన విడుదల చేశారు.
During yesterday’s , someone asked me about my fitness routine during this time. Hence, thought of sharing these Yoga videos. I hope you also begin practising Yoga regularly. https://t.co/Ptzxb7R8dN
— Narendra Modi (@narendramodi)
అంతేకాకుండా తానేమీ ఫిట్నెస్ నిపుణుడి, ఆరోగ్య నిపుణుడినో కాదని చెప్పారు. అయితే... ఎన్నో సంవత్సరాలుగా యోగా చేయడం తన జీవితంలో ఒక భాగమైందని చెప్పారు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నారు. చాలామంది ప్రజలు ఫిట్ గా ఉండటానికి ఎన్నో చేస్తుంటారని చెప్పారు. ప్రజలు కూడా తమ ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ యోగానే తనను లాక్ డౌన్ నుంచి కాపాడుతోందని చెప్పారు.