కరోనాపై మన నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శం: బీజేపీ కార్యకర్తలతో మోడీ

By narsimha lodeFirst Published Apr 6, 2020, 12:34 PM IST
Highlights

కరోనాపై మనం తీసుకొన్న నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ప్రశంసించినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు ఆయన పార్టీ కార్యకర్తలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.


న్యూఢిల్లీ: కరోనాపై మనం తీసుకొన్న నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ప్రశంసించినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు ఆయన పార్టీ కార్యకర్తలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.

కరోనాపై ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పోరాటం చేయాలని ఆయన కోరారు. కరోనా కట్టడి కోసం మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు.ఈ సమయం దేశానికి ఛాలెంజ్‌లాంటిదన్నారు. మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని మోడీ అభిప్రాయపడ్డారు.  వేగమైన నిర్ణయాలే కరోనా కట్టడి చేయగలుగుతాయని ప్రధాని చెప్పారు.

also read:ఆలస్యంగా కరోనా లక్షణాలు: 111 మందిని కలిసిన వ్యక్తి.....

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను  కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందన్నారు.అంతేకాదు అన్ని రాష్ట్రాల సహకారంతో కరోనాపై పోరాటం చేస్తున్నామన్నారు..కరోనా తీవ్రతను దేశ ప్రజలు అర్ధం చేసుకొన్నారని ఆయన అభిప్రాయపడ్డారు మోడీ.

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమంపైనే కేంద్రీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేసినట్టు ఆయన తెలిపారు.

పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి  కారణంగానే దేశవ్యాప్తంగా బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని మోదీ పేర్కొన్నారు. 

click me!