దేశంలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య: తెలుగు రాష్ట్రాల్లో ఊరట, రాష్ట్రాల వారీగా...

By telugu teamFirst Published Mar 25, 2020, 9:26 PM IST
Highlights

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగానే అయినా క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు కాస్తా ఊరట లభించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో ఎక్కువగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రం కాస్తా ఊరట పొందినట్లు కనిపిస్తోంది. బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 

బుధవారం రాత్రి 9 గంటల సమయానికి దేశంలో మొత్తం 645 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, కేరళలో 118 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39 కేసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ బుధవారంనాడు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం చాలా వరకు ఊరట.

రాష్ట్రాలవారీగా కేసుల సంఖ్య ఇలా ఉంది.

మహారాష్ట్ర 122
కేరళ 118
కర్ణాటక 51
తెలంగాణ 39
గుజరాత్ 38
ఉత్తప్రదేశ్ 38
రాజస్థాన్ 36
ఢిల్లీ 35
హర్యానా 31
పంజాబ్ 31
తమిళనాడు 23
మధ్యప్రదేశ్ 15
జమ్మూ కాశ్మీర్ 11
పశ్చిమ బెంగాల్ 9
ఆంధ్రప్రదేశ్ 8
చండీగడ్ 7
ఉత్తరాఖండ్ 5
బీహార్ 4
హిమాచల్ ప్రదేశ్ 3
చత్తీస్ గడ్ 3
ఒడిశా 2
పుదుచ్చేరి 1
మణిపూర్ 1
మిజోరం 1

వాటిలో 591 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 43 మందికి నయమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడం వల్ల వ్యాప్తి ఆగినట్లుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

click me!