పరీక్షలు రాయకున్నా... ఆల్‌పాస్: తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం

By Siva Kodati  |  First Published Mar 25, 2020, 8:28 PM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యార్ధులు తమ భవిష్యత్తు కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్ధులకు వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Latest Videos

Also Read:కరోనా లాక్ డౌన్: కత్తి దూసి పోలీసులనే బెదిరించిన మహిళా బాబా

అయితే వారికి వార్షిక పరీక్షలు రాసే అవసరం లేకుండా పై తరగతులకు వెళ్లే అవకాశాన్ని విద్యార్ధులకు కల్పిస్తున్నట్లు సీఎం పళని స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు మార్చి 24న జరిగిన ప్లస్ 2 పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు మరో రోజు పరీక్ష నిర్వహించనున్నట్లు పళనిస్వామి తెలిపారు.

తమిళనాడు ప్రభుత్వం మాత్రమే కాదు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అక్కడి ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 9 లోపు విద్యార్ధులకు జరగాల్సిన వార్షిక పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

8 రోజుల్లో మహాభారత యుద్ధాన్నే గెలిచాం.. 21 రోజుల్లో కరోనాపై గెలవలేమా: మోడీ

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు  విద్యార్ధులంతా ‘‘ ఆల్ పాస్’’ అని సర్కార్ స్పష్టం చేసింది. వారిని పరీక్షలు లేకుండానే పంపించినట్లు పుదుచ్చేరి ప్రభుత్వం వెల్లడించింది. 

బుధవారం తమిళనాడులో తొలి కరోనా మరణం సంభవించింది. మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 54 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ్ భాస్కర్ వెల్లడించారు. 

click me!