14 రోజులు క్వారంటైన్.. సడెన్ గా ఉన్నట్టుండి...

By telugu news team  |  First Published Apr 4, 2020, 10:29 AM IST

గుజరాత్‌లోని బనస్కాంతలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. బనస్కాంతలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో  ఆ వ్యక్తి గత 14 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నాడు


కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఎవరికివారు ప్రజలు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కొందరు లాక్ డౌన్ కి ముందే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే.. స్వీయ నిర్భందం తర్వాత ఓ వ్యక్తి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

Also Read కర్ణాటకలో మరో కరోనా మరణం: నాలుగుకు చేరిన మృతుల సంఖ్య...

Latest Videos

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్‌లోని బనస్కాంతలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. బనస్కాంతలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో  ఆ వ్యక్తి గత 14 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నాడు.  
ఆ తర్వాత అనుకోకుండా..  ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు  మార్చి 20 నుండి గృహ  నిర్బంధంలో ఉన్నాడు. ఆ యువకుని ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే  కారణమని తెలుస్తోంది. ఒంటరిగా ఉండలేక ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

click me!