తెలుగులో మోదీ ట్వీట్... చిరు, నాగ్ లను పొగుడుతూ...

By telugu news teamFirst Published Apr 4, 2020, 7:58 AM IST
Highlights

అంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం కావాలంటూ సూచ‌న‌లు చేస్తూ కోటీ సంగీత సారధ్యంలో ఓ పాటను కూడా రూపొందించారు. ఆ పాటలో ఈ నలుగురు హీరోలు నటించి.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్‌ల‌ను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.
 
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెలబ్రెటీలు తమ వంతు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే... చిరంజీవి, నాగార్జున, వరుణ్  తేజ్, సాయి ధరమ్ తేజ్ లు ఓ వీడియోని కూడా రూపొందించారు. 

అంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం కావాలంటూ సూచ‌న‌లు చేస్తూ కోటీ సంగీత సారధ్యంలో ఓ పాటను కూడా రూపొందించారు. ఆ పాటలో ఈ నలుగురు హీరోలు నటించి.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్‌ల‌ను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.

చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.

అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.

అందరం సామాజిక దూరం పాటిద్దాం.

కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. https://t.co/01dO5asinD

— Narendra Modi (@narendramodi)

‘‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ తెలుగులో అలా ట్వీట్ చేయడం.. తెలుగు హీరోలను అభినందించడం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా... ప్రధాని ట్వీట్ కి సదరు హీరోలు స్పందించాల్సి ఉంది.

click me!