లాక్‌డౌన్: నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, కేంద్రం ఆదేశం

By narsimha lode  |  First Published Apr 3, 2020, 10:37 AM IST

లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని కూడ కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.


న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని కూడ కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24వ తేదీన లాక్ డౌన్ నిబంధనలను  అమల్లోకి తీసుకొచ్చారు. లాక్ డౌన్  నిబంధనలు అమల్లో ఉన్నా కూడ కొన్ని చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

నాలుగు రోజులుగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

2005 డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టంలోని 51 సెక్షన్ నుండి 60 సెక్షన్ వరకు అన్ని వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

 ఐపీసీలోని సెక్షన్‌ 188 కింద కూడా  లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు.లాక్ డౌన్ ఏ పరిస్థితుల్లో అమలు చేస్తున్నారు, లాక్ డౌన్ ఉల్లంఘిస్తే ఏ రకమైన చర్యలు తీసుకొంటారనే విషయమై కూడ ప్రజలకు వివరించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. 

Also read:బాలింత ఉన్న గదిలోనే కరోనా రోగి: తల్లి,బిడ్డకు వైరస్

విపత్కర పరిస్థితుల్లో నిధులు, వస్తు సామాగ్రి దుర్వినియోగం చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడ విధించే అవకాశం ఉందని కూడ  ఆయన ఆ లేఖలో వివరించారు.ఇక నుండి లాక్ డౌన్ ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల ఆధారంగా కఠినంగా శిక్షించనున్నారు 
 

click me!